Logili Books

Autobiography and Biography

Chhatrapati Sahu Maharaj

By Chintada Gowri Varaprasad

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chhatrapati Sahu Maharaj
Publisher
Bhoomi Book Trust
ISBN
MANIMN6933
Binding
Paparback
Published Date
Feb, 2024
Number Of Pages
97
Language
Telugu
Availability
In Stock
About this book

సాహు మహారాజ్ జననం - విద్యాభ్యాసం

భారత కుల వ్యవస్థ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ సంఘటనకు నాంది పలికిన మహావ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్. సాహు అసలు పేరు యశ్వంతరావు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని కుంబీ కులస్తుడైన కాగల్ గ్రామ పెద్ద జయసింగ్గారావు, రాధాబాయిలకు జూలై 26వ తేది 1874లో జన్మించాడు. తల్లి మూడవ ఏటనే తనువు చాలించింది.

కుంబీ కులస్తుడైన శివాజీని మోరే పంతు పింగళి అనే పీష్వా బ్రాహ్మణుడు విష ప్రయోగం చేయించి చంపించాడు. అదే విధంగా ఛత్రపతి శివాజీ వారసులైన శంభాజీ మహారాజును కూడా కుట్ర పూరితంగానే చంపారు. ఆయన వారసులను ఎవర్నీ ఎక్కువకాలం బ్రతకనీయలేదు. ఛత్రపతి శివాజీ వంశంలోని స్త్రీలను రాజ్యాన్ని నిలుపుకొనే కర్తవ్యం తెలుసు. ఆనందబాయి మొదలుకొని తారాబాయి వరకు అనేక పోరాటాలు చేశారు.

తల్లి కోల్పోయిన యశ్వంతరావును మరాఠారాజు ఛత్రపతి శివాజీ రెండో కోడలు కొల్హాపూర్ సంస్థానానికి అధిపతి అయిన రాణి ఆనందబాయి ఆనాటి రాజరిక సాంప్రదాయాల ప్రకారం మరియు బ్రిటీష్ ప్రభుత్వ నిబంధనలైన డల్హౌసి ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం రాణి ఆనందబాయి యశ్వంతరావును దత్తత తీసుకొని 'సాహు' అని నామకరణం చేశారు.

ఈ సందర్భంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం.!

“క్రీ.శ.॥ 1848 -56సం॥ మధ్యకాలంలో భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసిన డల్హౌసి గవర్నర్ జనరల్స్ పదవిని అలంకరించిన వారందరిలో పిన్నవయస్కుడైనను, బ్రిటీషు సామ్రాజ్య కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేయుటంలో తన పూర్వీకులకు (పాలకులకు) తీసిపోని, ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించుటయే గాక మూర్తీభవించిన సామ్రాజ్యవాదానికి, అకుంఠిత కార్యదీక్షకు ప్రతిరూపం, తన లక్ష్యసాధనలో నీతి నియమాలను పాటింపక కార్యసాధనే ప్రధాన లక్ష్యంగా భావించాడు. తన 8 సం||ల పాలనాకాలంలో బ్రిటీషు సామ్రాజ్య విస్తరణయే ప్రధాన లక్ష్యంగా భావించి, రాజ్య సంక్రమణ సిద్ధాంతమును పటిష్టముగా అమలుపరిచి స్థానిక రాజ్యాలను ఆక్రమించుటయే గాక, తన పరిపాలనా సంస్కరణల.............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?