Logili Books

Autobiography and Biography

Bahan ji Kumari Mayawati

By Chintada Gowri Varaprasad

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bahan ji Kumari Mayawati
Publisher
Bhoomi Book Trust
ISBN
MANIMN6930
Binding
Paparback
Published Date
Dec, 2025
Number Of Pages
80
Language
Telugu
Availability
In Stock
About this book

ముందుమాట

మాయావతి (చమార్) మాదిగ కులంనకు చెందిన వ్యక్తి. మాయావతి చిన్నప్పటి నుంచే సామాజిక వివక్షతకు గురయ్యారు. చదవడమే కాకుండా అణగారిన అట్టడుగు వర్గాలు మనదేశంలో చాలాహీనమైన పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని వాటిని తొలగించేందుకు రాజకీయంగా ఉద్యమాలు నిర్వహించాలని ఆమె యుక్త వయస్సులోనే దృఢమైన అభిప్రాయానికి వచ్చారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం ఉద్యమించాలని ఆనాడే తీర్మానించారు. వివాహం కూడా చేసుకోకుండా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆమె ఉద్యమాలకు ప్రాధాన్యతనిచ్చారు. 1977 నుంచి 1984 వరకూ ఆమె వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేశారు. 1984లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ దశలో ఆమెకు అప్పటికి దళిత నాయకుడిగా దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న కాన్షీరాంతో పరిచయమేర్పడింది. ఇరువురూ తమ తొలి సమావేశంలోనే తమ లక్ష్యాలు, గమ్యాలు ఒక్కటేయని తెలుసుకున్నారు. ఐ.ఏ.ఎస్లను నియంత్రించే అధికారం రాజకీయాలల్లో చేరి మంచి పదవులు చేపడుతే వస్తుందని కాన్షీరామ్ ఉపదేశించడంతో మాయావతి బాట కొత్త మలుపు తిరిగింది. కాన్షీరామ్ మాటలను విశ్వసించి, ఆమె కాన్షీరామ్న తన గురువుగా భావించారు. కాన్షీరామ్ నేతృత్వంలో బి.యస్.పి. నిర్వహించిన ఉద్యమాలలో మాయావతి చురుగ్గా పాల్గొన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాల వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆ వర్గాల వారికి తిరుగులేని నేత అయ్యారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ చింతన కాన్షీరామ్ భావాలు ఆమెను అమితంగా ప్రభావితం చేశాయి.

ఉత్తరప్రదేశ్లో ఒక అబ్బురం, ఒక ఆశ్చర్యం జరిగింది. ఇది సామాన్యమైనది కాదు. 4 వేల సం||ల భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగనిది. "నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అన్న నానుడికి కాలం చెల్లింది." "ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్”. దేశంలోని పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా ఒక చమార్....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?