"నేను శ్యామ్ని మాట్లాడుతున్నా."
"శ్యామ్... ఎక్కడి నుంచి" ఫోన్లో అరిచినంత పని చేశాడు రవీంద్ర.
"హోటల్ బంజారా నుండి."
"అసలెప్పుడు వచ్చావ్? ఎన్ని సంవత్సరాలయిందిరా మనం కలుసుకొని!"
"అవన్నీ హాయిగా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నీ ఆఫీస్ ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారు?"
"రాత్రి ఎనిమిది గంటలదాకా తెరిచే వుంటుంది."
"నీ విషయం చెప్పు. నువ్వెన్ని గంటలకి బయటపడతావ్?"
"అయిదు గంటలకి."
"షార్ప్ ఫైవ్ కేనా?"
"విషయం ఏమిటో చెప్పు."
"నీకు వేరే ఎంగేజ్ మెంట్స్ లేవుగా."
"ఏమీ లేవు."
"నీకు వెహికల్ ఏముంది?"
"హీరో హోండా."
"అది ఆఫీసులో ఉంటే ప్రాబ్లమ్ లేదుగా."......................