• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Junior Doctor

Junior Doctor By Dr Srikanth Miryalu

₹ 220

మే 1 విడుదల

"చూడమ్మా! నొప్పులు వస్తుంటే నువ్వు ఒక్కసారి ముక్కాలి... నొప్పులు ఆగినప్పుడు కొంచెం ఊపిరి తీసుకో" అని ఎడం చేసిన ఆమె కాళ్ళ ముందు కూర్చుని గ్లవ్ వేసుకున్న చేతులతో ఒక కత్తెర పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు గౌతమ్.

సమయం రాత్రి ఒంటిగంట దాటింది.

ఆసుపత్రికి అందనంత దూరంలో, అంబులెన్సు అందుకోలేని మారుమూలలో ఉంది ఆ ఊరు. అప్పటికే ఎనిమిది గంటల నుండీ నొప్పులు పడుతున్న పక్కింటి నిండు గర్భిణీ గీత ప్రసవానికి సహాయం చేస్తున్నాడు గౌతమ్. గీతకి తొలికాన్పు ఇది. పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెల నెలా చూపించుకుంటూ, కాన్పు ఇంకో వారం రోజులు ఉందనగా.. ఆమెకి ఈ రాత్రికే నొప్పులు ప్రారంభం అయ్యాయి. అవి మామూలుగా వచ్చేపోయే నొప్పులే అనుకుని.. ఆమె ఎవరికీ చెప్పలేదు. ఇంతలో చీకటిపడింది. నొప్పులు ఎక్కువయ్యాయి. రాత్రి పదికల్లా బిడ్డ చుట్టూ ఉన్న పొరలు తెగి ఉమ్మనీరు బయటికి రావడం మొదలైంది. ఇక ఆమెకి భయం వేసింది. ఆమె వాళ్ళ అమ్మకి చెప్పటం, ఆ తర్వాత వరసగా పక్కనున్న అమ్మలక్కలు చేరుకోవడం జరిగింది. ఊళ్ళో ఉన్న కొత్త అంగన్వాడీ వర్కర్ కూడా వచ్చింది. ఆ అంగన్వాడీ వర్కర్ కి గర్భిణీలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తనిఖీలకి తీసుకెళ్లటం వరకూ మాత్రమే తెలుసు, కాన్పులు చెయ్యటంలో అనుభవం లేదు.

ఉమ్మనీరు పోయి రెండు గంటలు కావస్తోంది. అందరిలో గాభరా నెలకొంది. గీత నొప్పిని తట్టుకోలేకపోతోంది. అప్పుడే పక్కింటి గౌతమ్ వెళ్ళాడు. అంగన్ వాడీ వర్కర్ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన హోం డెలివరీ కిట్ను (డెలివరీ చేయటానికి కావల్సిన సామాగ్రి) తీసుకున్నాడు........................

  • Title :Junior Doctor
  • Author :Dr Srikanth Miryalu
  • Publisher :Aju Publications
  • ISBN :MANIMN6884
  • Binding :Paparback
  • Published Date :Dec, 2025
  • Number Of Pages :172
  • Language :Telugu
  • Availability :instock