Logili Books

History

Loukika Bhartham Kosam Gandhi

By Prabhat Patnaik

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Loukika Bhartham Kosam Gandhi
Publisher
Prajashakthi Book House
ISBN
MANIMN6805
Binding
Paparback
Published Date
Jan, 2026
Number Of Pages
136
Language
Telugu
Availability
In Stock
About this book

మహాత్మా గాంధీ గురించి మరోసారి

- ప్రభాత్ పట్నాయక్

ఎమరిటస్ ప్రొఫెసర్, ఆర్థిక శాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ,

ఇప్పుడు హిందూత్వ శక్తులు తమ ప్రత్యర్థుల్ని 'దేశద్రోహులు' అని ముద్ర వేయడం, తద్వారా తామే సిసలైన 'జాతీయ వాదానికి' వారసులం అని చూపించుకోవడం జరుగుతోంది. మన దేశ స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశమంతటా వ్యక్తమైన జాతీయవాదమూ, తాము ప్రవచించే జాతీయవాదమూ ఒక్కటేనన్నట్టు చిత్రించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వర్తమాన కాలంలో మనమీద సాగుతున్న అత్యంత దారుణమైన అవహేళన ఇది. స్వాతంత్ర్య పోరాటంలో ఎటువంటి పాత్రనూ పోషించనివాళ్ళు ఇప్పుడు ఆ పోరాటానికి తామే వారసులం అని చెప్పుకోడానికి పూనుకున్నారు. ఏ సంస్థ కు చెందిన కార్యకర్తలనుండి గాంధీ ని హతమార్చినవారు వచ్చారో, ఆ సంస్థకు చెందినవారే ఇప్పుడు ఆ గాంధీకి అసలైన వారసులం తామేనంటూ ప్రకటిస్తున్నారు.

ప్రజల హృదయాల్లో ఇప్పటికీ ఆ వలసపాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్యోద్యమం పట్ల ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌరవం ఉంది. ఎటువంటి అర్హతా లేకపోయినప్పటికీ, ఆ ప్రతిష్టను తమ పద్దులో వేసుకోడానికి హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

ఈ విధంగా స్వాతంత్ర్యోద్యమ ఘనతను తామే దక్కించుకోడానికి ప్రాతిపదికగా వాళ్ళు 'జాతీయత' అన్న పదానికి ఉన్న రెండు భావనలనూ కలగాపులగం చేయడానికి తలపడ్డారు. వాటిలో ఒక భావన యూరప్ లో తలెత్తింది. 17వ శతాబ్దంలో యూరప్ వివిధ సామ్రాజ్యాలు తమ నడుమ కొనసాగుతున్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దానినే వెస్టెఫాలియన్ శాంతి ఒప్పందం అంటాం. ఆ కాలంలో యూరప్ లో బూర్జువా వర్గం బలంగా..................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?