Logili Books

Short Stories

Merina O Merina

By Phaniharam Vallabhacharya

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Merina O Merina
Publisher
Phaniharam Vallabhacharya, Hyd
ISBN
MANIMN7026
Binding
Paparback
Published Date
Jan, 2026
Number Of Pages
118
Language
Telugu
Availability
In Stock
About this book

ఉప్పొంగిపోయిన ఏ ప్రణయోన్మాదంలోనో ఒడ్డున పారేసుకున్న జీవితాన్ని వెతుక్కుంటూ నురగలు కక్కుతూ వచ్చిన కెరటం గుంపులు గుంపులుగా చేరిన జనాన్ని చూసి వెనక్కి విరుచుకుపడి పారిపోతోంది మళ్లీ మళ్లీ ఆశ చావక !

శతసహస్రాబ్దాల రసగానంలో ఏ క్షణాన ఏ విరసుడి పెళుసు మాట ఉప్పుగల్లుగా పడిందో గానీ బతుకుంతా ఉప్పగా మారిపోయి బడబానలాన్ని పండించుకుంటూ నిరంతరం ఘోషిస్తూ ఎగసి ఎగసి పడుతోంది సముద్రం. దాన్ని కావలించుకొని ఓదార్చాలనిపిస్తుంది. నురగ కన్నీళ్లు తుడవాలనిపిస్తుంది. ఎగసి వస్తున్న కెరటంలో నిలువెల్లా నిలబడి ఆప్యాయంగా గుండెలకు అద్దుకోవాలనిపిస్తుంది. కానీ...

సముద్రాన్ని చూడగానే నేనే కరిగిపోతాను. నువ్వూ నేనూ ఒకటే అనుకుంటూ గొణుక్కుంటాను. ఆ హోరు నాలోనూ వుందని చూపుల్తోనే చెప్పుకుంటాను. అంతకన్నా ఏం చేయను ? ఏ క్షణాన ఆ పెదవి వంపులో బతుకు పారేసుకున్నానో, ఏ నిమిషాన ఆ కంటి మెరుపులో కరిగిపోయానో అప్పుడే నా సముద్రానికి దూరమై పోయాను.

చిన్నప్పుడు గోదావరి గట్టు మీద ఒకవైపు పంటకాలువ, మరోవైపు గోదారి... వాటిలో కురుస్తున్న వాన సన్నజాజిపూలు ఆకాశం నుండి కురుస్తున్నట్టు మొహం మీద పడుతుంటే స్కూలు నుంచి తిరిగొస్తున్న సాయంత్రాలు ఇప్పుడేవీ ?

గోదారి అలలతో తడిసిపోయిన ఇసుకలో పరికిణీ కుచ్చిళ్లు పైకి పట్టుకొని చిన్ని లేత పాదాలతో నడుస్తూ, వెనక్కి తిరిగి అడుగుజాడలు చూసుకుంటూ నడుస్తూ, లేడి పిల్లలా గెంతుకుంటూ నదిని కళ్ల నిండా నింపుకుంటూ... ఏమై పోయింది ఆ గుండె ?

గోదారిని వదిలేసి నాన్న ఉద్యోగంతో పాటు ఈ తమిళ రాజధానిలో పడి, ప్రతి సాయంత్రం మెరీనాలో కెరటాల్ని కవ్విస్తూ, నురగల్ని నవ్విస్తూ, సముద్రాన్ని సముదాయిస్తూ...

అబ్బ ! అప్పుడే ఏడేళ్లు అయిపోయాయా ఆ అలల్ని తాకి ?

అవును ! అప్పుడే ఏడేళ్లు! ఏడేళ్ల క్రితం ఇదే సాయంత్రం... కెరటాల్ని తరుముతూ, మీదకొస్తున్న కెరటాల్ని 'చేతనైతే నన్ను పట్టుకోండి' అని కవ్వించి వెనక్కి పరుగెడుతూ... ఎప్పటికో గానీ చూడలేదు. ఎంతసేపటి నుంచీ చూస్తున్నాడో అతడు. తెల్లని పైజమా, లాల్చీ, ఛాతీ మీద ముడేసిన చేతులు... అదేపనిగా చూస్తున్నాడు వేరే పని లేనట్టు. ఇన్ని సంవత్సరాలూ విశృంఖలంగా సముద్రంతో సమానంగా కదిలిన నా పాదాలు ఫణిహారం వల్లభాచార్య...........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?