వరుణ్
అక్టోబర్, 2017
"అరే నిక్కీ, నీకు మేఘనా గుర్తుందా?" అంటూ నిఖిల్కి కాల్ చేసి ఉద్వేగంగా అడిగాను.
“మేఘనానా, ఏ మేఘనా రా?”
“అదేరా అప్పుడు మన కేరళా ట్రిప్లో, హోటల్ వాళ్ళ వాన్ పక్కన మనిద్దరం నిలబడితే, ఆటాడుకున్న తెలుగు అమ్మాయిల గాంగ్, అదే నువ్వు తీసిన ఫోటోలో ఉన్న అమ్మాయి. మర్చిపోయావా?”
“ఓహ్ ఆ అమ్మాయా! ఇప్పుడు నీకెక్కడ కనిపించింది?”
“ఇందాకే నా క్లినిక్కి వచ్చెళ్ళింది.”
“వాళ్ళు వరంగల్ నుంచి వచ్చారని ఆ హోటల్ అతను చెబితే, మనం అక్కడున్న కాలేజీలన్నింటిలో అడిగాం కదా! దొరక్కపోయేసరికి వేరే ఊరేమో అనుకున్నాం,” అని తను అంటుండగానే, నేను వెంటనే అందుకుని, “అప్పుడు మనకు ఎందుకు దొరకలేదంటే ఆ అమ్మాయి పేరు మేఘనా కాదు, అందుకే వర్ష. అప్పుడు పట్టుకోలేకపోయాం.”
నిక్కీ ఆ మాటలకి, "ఓహో మేఘం కాదు వర్షం అన్నమాట. ఇంతకీ నీ క్లినిక్కి ఎందుకొచ్చింది?
"మెడ నొప్పులు, భుజాల నొప్పులట. IT లో వర్క్ చేస్తోంది. పే పాకేజ్తో పాటు, IT వాళ్ళకి ఈ నొప్పులు కూడా బోనస్ కదా.”
" ఆ అమ్మాయేనా? నాకసలు ఆ రోజు చూసిన ఎవ్వరి ఫేసులు గుర్తులేవు. ఇప్పుడు నా ముందుకొచ్చి నిలబడ్డా గుర్తుపట్టలేను. ఆ ఫోన్ పోయి చాలా యేళ్ళయ్యింది, అందులో ఫోటోలు బాకప్ కూడా తీసుకోలేదు.”
"పక్కా ఆ అమ్మాయే. నేను తన ఫోటోని ప్రింట్ కూడా వేయించాను.”
“ఏంటి తన ఫోటో ప్రింట్ వేయించావా? నాతో ఎప్పుడూ అనను కూడా............................