Logili Books

Autobiography and Biography

Nenu Lenu

By Sri Gantela Venkata Ramana

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nenu Lenu
Publisher
Sivananda Supadha Foundation
ISBN
MANIMN6813
Binding
Paparback
Published Date
July, 2024
Number Of Pages
416
Language
Telugu
Availability
In Stock
About this book

'సత్యం' ఎలా తెలుస్తుంది ?

అపౌరుషేయమైన మన వేదవాఙ్మయం అంతా భౌతిక శాస్త్రం వంటిది కాదు. వేదాల్లోని సత్యాన్ని అధ్యయనం చేసిన మహాత్ముల అనుభవసారమే ఉపనిషత్తుల బోధగా మనకు లభించింది. వేదప్రతిపాదన అనుభవానికి ఎలా సరిపోతుందో ధృవీకరించే మహర్షుల నిర్ధారణే ఉపనిషత్ సారం. వేదం చెప్పిన ఈశ్వరతత్త్వాన్ని అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకున్నదే ఉపనిషత్తులుగా ఆవిష్కృతమైంది. సృష్టితోపాటు వచ్చిన జ్ఞానమే మనకు వేదం అందించిన వెలుగు.

సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనసును అర్థం చేసుకోవడం, మనసును స్థిరంగా ఉంచడం, మనసును పవిత్రంగా ఉంచడం అవసరమని జ్ఞానుల బోధ. సాధన అంటేనే మనసును సంపూర్ణంగా తెలుసుకోవడం. మనసును అర్థం చేసుకోవడం. మనస్సు గుణాలుగా, జ్ఞాపకాలుగా, సుఖదుఃఖ అనుభవాలుగా కనిపిస్తుంది. జ్ఞాపకం, అనుభవం, సుఖం-దుఃఖం. ఇదే మనసుగా వ్యక్తం అవుతుంది. మనస్సును అర్థం చేసుకోవడం అంటే ఇలా మనసు ప్రక్రియను విశ్లేషించడం కాదు. జ్ఞాపకం సందర్భానుసారంగా భావంగామారి అనుభవంగా ముగుస్తుంది. ఏదైనా కోరిక ఎక్కడో విన్నదో, చూసిన జ్ఞాపకమో, అది గతంకానీ, ప్రస్తుతంకానీ జ్ఞాపకంలో ఉన్నదే భావంగా వస్తుంది. సామూహిక మనసే సమాజం. ఏదో ఒక ఆలంబన లేకుండా మనస్సు పుట్టదు. ఇలా మనసును, దాని మూలాన్ని సమూలంగా అవగాహన చేసుకోవడమే మనస్సును సంపూర్ణంగా చేసుకోవడం.

మనస్సు స్థిరంగా ఉండటం అంటే సత్యాన్ని తెలుసు కోవాలన్న లక్ష్యంకోసం దృఢంగా ఉండటం. అందుకు స్వచ్ఛమైన ఆలోచన, ఏకాగ్రతలు అవసరం అవుతాయి. మనసుకు స్వచ్ఛత ఎలా వస్తుంది ? కామ, క్రోధ, లోభ, మోహ,.................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?