• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

RUN Thriller Kathalu

RUN Thriller Kathalu By Shankar Ramamurty

₹ 200

చీకటి. నాలుగు వైపులా చీకటి. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎంత నిశ్శబ్ధం అంటే తీసుకునే ఊపిరికూడా రీ సౌండ్ అయ్యి వెన్నులో వణుకు పుట్టించేంత!

ఆ చీకటిలో ఎక్కడ ఉన్నాడో అతనికి అర్థం కావడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. దూరంగా ఏదో కనిపిస్తూ ఉంది. తెల్లగా మెరుస్తూ ఉంది.

"ఏంటది? ఏంటది? ఏమైంటుంది?" అని ముందుకు కదలడానికి ప్రయత్నించాడు అతను. కానీ కదలలేకపోయాడు.

"ఎందుకు కదలలేకపోతున్నా?” అని కిందకు చూసుకున్నాడు. ఆశ్చర్యం! తనకు కాళ్ళు లేవు. చేతుల వైపు చూసుకున్నాడు. చేతులూ లేవు. అసలు తనని తను ఫీల్ అవ్వలేకపోతున్నాడు అతను.

"ఎవరు నేను? ఎక్కడున్నాను? అసలు నేను మనుగడలో ఉన్నానా? కొంపదీసి నేను ఫిజిక్స్లో చెప్పే పరమాణువునైయ్యానా? లేదు, లేదు. ఇది బ్లాక్ హోల్ అయ్యింటుంది. నేను ఖచ్చితంగా బ్లాక్ హోల్లో ఉన్నాను. లేదా ఇది ఫ్లూటో గ్రహం అయ్యింటుంది. ఫ్లూటో గ్రహంలోనే ఇలా ఉంటుంది అని విన్నాను. అయినా ఫ్లూటోని గ్రహాల లిస్ట్లోంచి తీసేశారుగా. మరి నేను ఇప్పుడు ఎక్కడున్నట్టు?"

ఇంతలో ఎవరో భుజం మీద తట్టారు. "ఎవరు? ఎవరది? నా స్పర్శ నాకే తెలియడం లేదు. నువ్వు భుజం మీద చేయి వేస్తే నాకెలా తెలిసింది? ఎవరు నువ్వు?”

ఏదో గొంతు. "సార్, సార్,” అని పిలుస్తోంది. మగ గొంతు. వెయిట్ - అది మగ గొంతు కాదు. "సార్, సార్," అది ఆడ గొంతు.

ఒక్క కుదుపు. అతను కళ్ళు తెరిచాడు. ఒక అరవై ఐదు కేజీల బరువును, నలభై....................

  • Title :RUN Thriller Kathalu
  • Author :Shankar Ramamurty
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN6261
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :169
  • Language :Telugu
  • Availability :instock