Logili Books

Novels

Nadinarudu

By Simhaprasad

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nadinarudu
Author
Publisher
Sri Sri Prachuranalu
ISBN
MANIMN2421
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

నది గమనానికి నరుడి జీవన గమనానికి సారూప్యత చాలా ఉంది. రెండూ సుదీర్ఘ పోరాటాలే... ఎదురయ్యే కొండలను , బందాలనూ దాటుకుంటూ నది సాగుతుంది. గండ శిలలు అడ్డుకున్నప్పుడు చుట్టూ తిరిగి వెళుతుందే తప్ప గమనాన్ని ఆపదు . గమ్యం చేరేదాకా అలసిపోదు. ఆగిపోదు.. అది నదీతత్వం. ప్రవాహ వేదం!

నదిని మనిషిని పోల్చుతూ "నది నరుడు" పేరుతో మంచి నవలను అందించారు శ్రీ సింహప్రసాద్.

"ఈషణ త్రయం" అనేవి మూడు మూడే!

ప్రతిమనిషికీ ఉండేవే... అవసరమైనవి...

కానీ అవధులు మీరితే వాటంతటి ప్రమాదకరమైనవి ప్రపంచంలో మరి లేవు.

కథానాయకుడు వేణుగోపాలరావు ఈ మూడింటి వలలో చేపలా చిక్కి, ఎలా విలవిలాడాడు? చివరకు ఎలా బయటపడ్డాడు అన్నదే కథాంశం.

ఈ నవల చదువుతున్నప్పుడు కేవలం వేణుగోపాలరావు కథే చదువుతున్నట్టు ఉండదు. మన కథనే మనం చదువుతున్న భావన కలుగుతుంది. మన జీవిత గమ్యం కూడా ఈ నవల నిర్దేశిస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?