Logili Books

Short Stories

Sadanand Sarada Kathalu

By Sadanand Sarada

₹180
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sadanand Sarada Kathalu
Publisher
Nava Chetan Publishing House
ISBN
MANIMN3793
Binding
Papar back
Published Date
Dec, 2016
Number Of Pages
273
Language
Telugu
Availability
In Stock
About this book

జాడీ

“గవురిగా... ఒరేయ్ గవురిగా..." అంటూ పిలిచాడు... కాదు అరిచాడు దొర.

ఎముకలపై ఆరవేయబడిన ఒళ్ళును మోస్తూ కర్రలాంటి రెండుకాళ్ళు నడిచి వచ్చాయి.

"ఏంది బాంచెను" అంది ఎముకలగూడుమీది తల

ఏందీ బాంచెను అనే తల+ఎముకల గూడు = ఆ గవురయ్య

కాని, ఇప్పుడా ఎముకలగూడు; ఏంది బాంచెను అనే తల కలిస్తే గవురయ్య కాలేదు “గవురిగాడు" అయింది.

దొర ముందు “గవురిగాడు" నిలుచున్నాడు.

గవురయ్య ముందు “దొరగోరు” కూర్చొని ఉన్నారు

దొర విలాసంగా కూర్చొని ఉన్నాడు.

గవురయ్య వణుకుతూ నిలుచున్నాడు.

దొరను, దొర కూర్చొన్న కుర్చీని భూమి మోస్తున్నది.

గవురయ్య కాళ్ళను అదే భూమి మోస్తున్నది.

దొర ఒంటిమీద పదిమందికి సరిపోయే దుస్తులు. సంపద వున్నాయి. వున్న పదిమందికి దానం చేసిన వ్యక్తిలాగున్నాడు గవురయ్య. అతని మొలచుట్టూ చిరిగిన గుడ్డ పేలికలు మాత్రమే వున్నాయి.

దొరను మోస్తున్న కర్ర కుర్చీకి. గవురయ్యను మోస్తున్న కర్రల్లాంటి కాళ్ళకు మధ్యనున్న దూరం వాళ్ళ వయసుల మధ్య లేదు.

దొరలో మంచితనంలాగే ముసలితనం కూడా కనిపించడంలేదు.

దొర ముసలితనాన్ని కూడా తానే మోస్తున్నట్టు కనిపిస్తున్నాడు గవురయ్య.................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?