• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sahityamlo Samajam

Sahityamlo Samajam By Dr N Eswara Reddy

₹ 150

పరిచయం
 

ఆలూరి బైరాగి కవిత్వం - అస్తిత్వ వేదన
 

"అంశిక సత్యాల అర్ధ సత్యాల, అసత్యాల ఆధిపత్యంలో
ముక్కు చెవులు తెగిన సత్యాన్ని మనం గుర్తు పట్టలేం"

అని ప్రపంచ మానవ పోకడను తెగేసి చెప్పిన కవి,

"ఈర్యాద్వేష మోహాపోహ వాంఛా కాంక్షల కీలలు” మనిషిని దహిస్తుంటే చూస్తూ కూర్చోలేకపోయిన తాత్వికుడు,

"కలలొస్తాయని భయపడి కన్నులు మూయలేనివాడు,
కలలు కరిగిపోతాయని కనులు తెరవలేనివాడు
ఆకాశపు స్వేచ్ఛ చూసి మోము త్రిప్పుకునేవాడు

చెరలోన ఊపిరాడక మొరపెట్టుకునేవాడు”

ఈ సమాజానికి పనికిరాని భయస్తులుగా తేల్చేసిన సామాజికవేత్త ఆలూరి బైరాగి.

చిక్కని భావుకత జోడించుకున్న అనుభూతి వాదిగా, అస్తిత్వ వాదానికి బలం చేకూర్చిన ఆధునిక రచయితగా, స్థానిక సమస్యల నుండి అంతర్జాతీయ సంక్షోభాల దాక కవిత్వాన్ని మాధ్యమంగా చేసుకొని మాట్లాడిన కవి ఆలూరి బైరాగి.

జననం - విద్యాభ్యాసం - జీవితం

ఆలూరి బైరాగి సెప్టెంబరు 5, 1925లో తెనాలి దగ్గరలోని ఐతాపురంలో రైతుకుటుంబంలో జన్మించాడు. సరస్వతమ్మ - వెంకట్రాయుడు ఆయన తల్లిదండ్రులు, మూడవ సంతానంగా జన్మించిన మగబిడ్డకు 'బైరాగి' అని పేరు పెట్టుకున్నారు ఆ..................

  • Title :Sahityamlo Samajam
  • Author :Dr N Eswara Reddy
  • Publisher :Progressive Writers Association
  • ISBN :MANIMN5120
  • Binding :Papar Back
  • Published Date :185
  • Number Of Pages :185
  • Language :Telugu
  • Availability :instock