Logili Books

History

Trilinga Paripalana Trisahasra Gatakala 1 & 2 parts

By Kunareddy Ramarao B A

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Trilinga Paripalana Trisahasra Gatakala 1 & 2 parts
Publisher
Sai Lakshmi Sowjanya Acadamy
ISBN
MANIMN7152
Binding
Paparback
Published Date
Aug, 2026
Number Of Pages
145
Language
Telugu
Availability
In Stock
About this book

ముందుమాట

త్రిలింగదేశం - తెలంగాంధ్ర ప్రదేశం - తెలుంగు నిర్దేశం

త్రిలింగదేశం అంటే మూడు లింగాల భూమి అని అర్థం. స్కందపురాణంలో పశ్చిమాన కాళేశ్వరం, దక్షిణాన శ్రీశైలం, తూర్పున దాక్షారామం, శ్రీకాకుళం, మహేంద్రగిరిలవరకు విస్తరించిన ప్రాంతంగా పేర్కొనబడింది. ఇది ఆధునిక తెలంగాణా, రాయలసీమ, కోనసీమ ప్రాంతానికి పురాతనపేరు త్రిలింగ దేశం. పశ్చిమాన ఉన్న తెలంగాణాలోని భూపాలపల్లిలోని ముక్తేశ్వరస్వామి, కాళేశ్వరాలయం, దక్షిణాన రాయలసీమలో శ్రీశైలం మల్లికార్జునుడు, తూర్పున కోనసీమలోని దాక్షారామ భీమేశ్వరుడు, శ్రీకాకుళం ప్రాంతంలోని మహేంద్రగిరివరకు ఉన్న ప్రాంతాన్ని అనేక కావ్యాలలో  మూడువేల సంవత్సరాల తెలుగు ప్రాంత చరిత్ర త్రిలింగదేశమని పిలవబడింది. ఈ ప్రాంతాలవారిని త్రిలింగవారని, తర్వాత తెలింగవారని, కాలక్రమేణా తెలంగాణావారు, తెలగాలవారని పిలవబడింది. ఈ ప్రాంతం ఆంధ్ర అని పిలవబడటానికి కారణం ఆంధ్రరాజులు పరిపాలించినందువల్ల ఆంధ్ర అనే పేరు వచ్చింది. విశ్వామిత్రుని కుమారులు దక్షిణదేశానికి వెలివేయబడినారని, వారిని అంధులు, పుళిందులు, కళింగులు అని ఆ విషయం ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నట్టు కల్పించారు. అంధులు ఆంధ్రులు అనడానికి ఎటువంటి ఆధారం, సంబంధం లేదు.

ఆంధ్రులు, కళింగులు, అంగులు, వంగలు ఎవరన్నది మహాభారతం, మహాభాగవతంలో వివరించబడింది. మహాభారతంలో యయాతి గురించి మనందరికీ తెలుసు. యయాతికి నలుగురు కుమారులు అనువు, ద్రుహ్యడు, తుర్వాసుడు, యదువు. యయాతి కుమారుడు అనువు వంశంలో ఐదవ వారసుడు శిబిచక్రవర్తి. శిబిచక్రవర్తికి మూడవతరంవాడు హేమచక్రవర్తి మనవడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి, సుధేష్ణలకు అంగుడు, వంగడు, కళింగుడు, సుహ్ముడు, ఆంధ్రుడు, పుండ్రుడు అనే ఆరుగురు కుమారులు జన్మించారు. వారు పరిపాలించిన దేశాలకు ఆయా రాజుల పేరుతో రాజ్యాలు వెలిశాయి. అంగరాజ్యం (బీహార్ ప్రాంతం), వంగరాజ్యం (పశ్చిమ బెంగాల్ ప్రాంతం), కళింగరాజ్యం (ఒరిస్సా ప్రాంతం), పుండ్రరాజ్యం (బంగ్లాదేశ్ ప్రాంతం), సుహ్మరాజ్యం (పాకిస్తాన్ ప్రాంతం), ఆంధ్రరాజ్యం (త్రిలింగప్రాంతం). త్రిలింగదేశాన్ని ఆంధ్రుడు, అతని వంశస్థులు పాలించినందువల్ల ఆంధ్రగా పిలవబడింది. ద్రుహ్యని వారసులు గాంధార వంశస్థులుకాగా, తుర్వసునికి అతని వారసులలో.................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?