• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yama Deepam

Yama Deepam By Sri Dharan Kanduri

₹ 270

  1. హైందవ తంత్రశాస్త్రాలలో చెప్పబడిన "యమదీపం" యొక్క నిగూఢ రహస్యములు?

ఈ సృష్టిలో మంచి ఉన్నట్లుగానే చెడు కూడా ఉన్నది. అలాగే 'సకారాత్మక శక్తులను (పాజిటివ్ ఎనర్జీస్) సృష్టించిన ఆ దైవమే నకారాత్మక శక్తులను (నెగటివ్ ఎనర్జీస్) కూడా సృష్టించాడు. రెండు వ్యతిరేకమైన శక్తులు ఉన్నప్పుడే ఈ ప్రకృతి సమానంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ప్రకృతిలో నకారాత్మక శక్తులయొక్క శక్తి పెరిగిపోతుందో అప్పుడు సకారాత్మక శక్తులు బలహీనపడతాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రేతాత్మలు విజృంభిస్తాయి. ఫలితంగా, మానవులలో చెడు భావాలు చెలరేగిపోతాయి. మానవులు మంచి-చెడు, పాపం- పుణ్యం అనే భావాలను పూర్తిగా మర్చిపోతారు. ఆపై ఆ మానవులు తమకు తోచిన చెడుకార్యాలు నిస్సంకోచంగా చేస్తారు. అనగా ప్రకృతిలో నకారాత్మక శక్తుల ప్రభావం అధికమైనదికొద్దీ మానవులకు చెడుజరగటం అధికం అవుతుంది. ఈ నకారాత్మక శక్తుల బలం తగ్గించటంకోసం దేవతారాధన మరియు ఆ దైవాలముందు నూనెదీపాలు వెలిగించటం అనే రెండు సాంప్రదాయాలను ప్రాచీన హైందవ మహర్షులు ప్రవేశపెట్టారు.

ఒక గృహంలో లేదా ఆలయంలో దైవం ముందు నూనెతో దీపం వెలిగించినప్పుడు ఆ దీపం వెలుగు నుండి సకారాత్మక శక్తులయొక్క శక్తి, అయస్కాంత తరంగాల రూపంలో ఆ దీపం చుట్టూ ఉండే ప్రదేశంలో వ్యాపిస్తుంది. ఫలితంగా అప్పటి వరకు ఆ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న నకారాత్మకశక్తి యొక్క ప్రభావం చాలా వరకు బలహీనపడుతుంది. ఫలితంగా, ఆ పరిసరాల్లో ఉన్న మనుషులకు మనస్సు ప్రశాంతంగా మారటం, ఆరోగ్యం లభించటం లాంటివి సంభవిస్తాయి.

కొంతమంది దైవ భక్తులు - ఎక్కువ దీపాలు వెలిగిస్తే ఎక్కువ దైవశక్తి అనగా సకారాత్మక శక్తి (పాజిటివ్ ఎనర్జీ) విడుదల అవుతుందని, తద్వారా తమకి అధిక స్థాయిలో మంచి ఫలితాలు లభిస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ, అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే ఒక దీపం వెలిగించినా, వంద దీపాలు వెలిగించినా విడుదలయ్యే నకారాత్మక శక్తియొక్క స్థాయి ఒకేరకంగా ఉంటుంది. దీపాల సంఖ్యను బట్టి వాటి నుండి విడుదల అయ్యే శక్తి పెరగదని అర్ధంచేసుకోవాలి. ఇంకొక ముఖ్య.................

  • Title :Yama Deepam
  • Author :Sri Dharan Kanduri
  • Publisher :Sri Dharan Kanduri
  • ISBN :MANIMN5236
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :286
  • Language :Telugu
  • Availability :instock