సంపాదకుని స్పందన
“జనానికి రకరకాల రంగులుంటాయి,
తనకంటూ ఒక రంగు లేకుండా అన్ని రంగులనూ కలుపుకునేది ప్రభుత్వం. జనానికి రకరకాల పక్షపాతాలుంటాయి,
తనకంటూ ఒక పక్షపాతం లేకుండా జనపక్షపాతం వహించేది ప్రభుత్వం. జనానికి రకరకాల సంస్కృతులుంటాయి,
తనకంటూ ఒక సంస్కృతి లేకుండా అన్ని సంస్కృతులను ప్రతిఫలించేది. ప్రభుత్వం.
జనానికి రకరకాల మతాలుంటాయి,
తనకంటూ ఒక మతం లేకుండా అన్ని మతాలకు సమదూరం పాటించేది ప్రభుత్వం.
బిడ్డలు రకరకాలుగా ఉంటారు,