• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gundenu Tattina Cinimalu

Gundenu Tattina Cinimalu By Paresh Doshi

₹ 350

A death in the gunj

నాకు ఇష్టమైన నటి కొంకొణా సేన్ శర్మ, మొదటిసారి దర్శకత్వం వహించిన "a death in the gunj" చూశాను. చాలా నచ్చింది. అందుకే నాలుగు ముక్కలు వ్రాద్దామని కూర్చున్నా. కథా కాలం 1979, బిహార్ (ఇప్పటి జార్ఖండ్) లో మెక్లూసిగంజ్ లో జరుగుతుంది. నందు (గుల్షన్ దేవాయా), అతని భార్య బోనీ (తిలోత్తమా షోం), ఆమె యెనిమిదేళ్ళ కూతురు తాని (ఆర్య శర్మ), ఆమె స్నేహితురాలు మిమి(కల్కి కేక్లా), కజిన్ శ్యామల్ ఛటర్జీ ముద్దు పేరు షుటు (విక్రాంత్ మెస్సీ) వారం కోసం గంజ్ లో వున్న ఓంపురి-తనూజల (నందు తల్లిదండ్రులు) ఇంటికెళ్తారు. అక్కడ విక్రాంత్ (రణవీర్ శౌరి), బ్రియాన్ (జిం శర్చ్) కూడా వస్తారు. ఆ వారంలో అక్కడున్నవారి మధ్య జరిగే మామూలు సంఘటనలే ఈ సినిమా కథ.

అణిచివేత లాంటివి యేదో వొక ప్రాతిపదిక మీదనే కాదు, యెలాంటి కారణమూ లేకుండా కూడా చాలామంది చేస్తుంటారు. అయితే అణిచివేత అన్న పదం కాదు గాని bully కి సమానార్థకమైన పదం వాడాలి. యెవరైనా మెతక మనిషి కనబడాలే గాని సరదా గానో, తమ అక్కసు తీర్చుకోవడం కోసమో, లేదా పుట్టిగానే మొత్తే వాళ్ళకు కొదవ లేదు. అది అవతలి వ్యక్తి మీద యెలాంటి ప్రభావం చూపుతుందో పట్టించుకోరు.

మొదటి దృశ్యం నుంచీ 23 యేళ్ళ షుటు బిడియస్తుడిగా, భయస్తుడిగా, ఆత్మనూన కలవాడిగా కనిపిస్తాడు. సమీపగతంలో తండ్రి పోయాడు. తల్లి...................

  • Title :Gundenu Tattina Cinimalu
  • Author :Paresh Doshi
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN4087
  • Binding :Papar back
  • Published Date :Jan, 2023
  • Number Of Pages :328
  • Language :Telugu
  • Availability :instock