• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Varadagudi Anuvaada Kathalu

Varadagudi Anuvaada Kathalu By Paresh Doshi

₹ 350

షడ్రుచుల కథా విందు

భూమిని హిరణ్యాక్షుడు చాపలా చుట్టి సముద్రంలోకి విసిరేశాడని చెప్పాయి పురాణాలు!

కాదు.. కాదు.. భూమి గుండ్రంగా ఉందని చెప్పింది సైన్సు!

కానీ మన కాలపు మహా రచయిత పతంజలి మాత్రం 'భూమి పోలీసోడి చేతిలోని లారీలా ఉంటుంద'ని చెప్పాడు.

ఇది పరమ కఠోరమైన జీవిత వాస్తవం!!!

పరేశ్ దోశీ అనువాద కథలు ఇలాంటి 'కఠోర జీవిత వాస్తవాలు' ఎన్నింటినో మన కళ్ళ ముందు ఉంచుతాయి. లౌకిక విషాదాలను మన ముందు నగ్నంగా నిలబెడతాయి.

ఏ కథ అని చెప్పను? ఏ రచయిత అని చెప్పను?

అందరూ మహానుభావులే.. కథాప్రపంచ వైతాళికులే!

అలనాటి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి ఆర్.కె. నారాయణ్, ఆశాపూర్ణాదేవి, యశపాల్, అమృతా ప్రీతమ్, అనితా దేశాయ్ వంటి ఎందరెందరో జగత్ జెట్టీల కథలు ఇందులో ఉన్నాయి.

'చెవి పోయినా పర్వాలేదు.. చెయ్యి పోయినా పర్వాలేదు.. ఆఖరికి కన్ను పోయినా ఫికర్లేదు' అని ఉదాసీనంగా ఉన్న ఓ వ్యాపారి 'ఏది పోయినప్పుడు' గంగ వెర్రులు ఎత్తాడో తెలిస్తే కొయ్యబారి పోతాం ఉర్దూ కథా సమ్రాట్ కిషన్ చందర్ 'దొంగతనం' కథ చదివినప్పుడు!

సగటు మనిషి తత్వాన్ని అత్యంత వ్యంగ్యంగా తీర్చిదిద్దడంలో ఆయనను మించినవారెవరు?..........

  • Title :Varadagudi Anuvaada Kathalu
  • Author :Paresh Doshi
  • Publisher :Chaaya Resource Centre
  • ISBN :MANIMN5166
  • Published Date :2024
  • Number Of Pages :353
  • Language :Telugu
  • Availability :instock