Logili Books

Novels

Kanchana Kanya

By Bhayankar

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kanchana Kanya
Author
Publisher
Classic Books
ISBN
MANIMN7079
Binding
Paparback
Published Date
Aug, 2026
Number Of Pages
239
Language
Telugu
Availability
In Stock
About this book

కాంచనకన్య

"అతులిత సౌభాగ్య సంపదలతో అంతులేని భోగాలనుభవిస్తూ, పరిచారికా గణాలచేత సేవలు చేయించుకొంటూ, మహారాణీలా - వెలలేని ఆభరణాలూ, చీని చీనాంబరాలూ ధరించి, మహదానందంతో సంసార సుఖాలనుభవిస్తున్నావనుకున్నానే గాని, నువ్విక్కడ ఇలా దుఃఖితురాల వవుతున్నావని కలలో కూడా అనుకోలేదు, చెల్లాయ్! ఇక్కడి యదార్థస్థితి యేమిటో చెబితే, తరుణోపాయమును ఆలోచిస్తాను,

“ఆలోచించవలసింది కానీ, ఆచరించవలసింది కానీ, ఏమీ లేదన్నయ్యా! అంతా నా తలవ్రాత! తప్పించడానికి ఎవరికీ శక్యం కాదు.”

“అన్ననుగదా, అడుగుతున్నప్పుడు, నాకు చెప్పరాదుటమ్మా! నీకిప్పుడు కలిగిన లోటేమిటి?”

“నువ్వూహించినంత వరకు, అంతా నిజమే! భోగభాగ్యాలూ వున్నాయి. దాసదాసీలూ వున్నారు. అనుభవించడానికి మాత్రమే నేను నోచుకోలేదు.”

"ఎందుకని?”

“చెప్పుకొని ఏం ప్రయోజనంలే, అన్నయ్యా!”

“ప్రయోజనం లేకపోయినా నీ దుఃఖ కారణమేమిటో నేను తెలుసుకోవలసిందే! రేపో మాపో సత్సంతానమును కని, వంశోద్ధారకురాలవు కూడా కాబోతున్నావు!” “ఎవరు సంతోషించాలి?”

"తప్పు తప్పు! అదేం మాట?”

వాసంతి కన్నీళ్ళను కొనగోళ్ళ మీటుకుంటూ తల దించుకుంది. ఆమె అన్న - ప్రతాపుడు అది చూచి భరించలేకపోయాడు.

"అమ్మా! నాన్న లేకపోయినా, నీ కష్టాల్లో భాగం పంచుకోడానికి నేనున్నాను. నువ్వు కంట తడి పెట్టడం. మార్తేనే నేనిక్కడ నిలబడేది. లేకుంటే, ఇదుగో, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను.”........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?