• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mahodayam

Mahodayam By KVR

₹ 300

“ఆదిత్య హృదయం”

పెక్కు లొకటిగ జూచువాడే ప్రాజ్ఞుడన వినమే?

ఆంధ్ర దేశంకంటె ఎంతో బాగుంటుందనుకొని ఆత్మహత్య చేసుకొని నరకానికి వెళ్ళిన శ్రీశ్రీకి, అక్కడ వరండాలో చుట్టగాల్చుకొంటూ అసిరిగాడు కనిపించాడు. వాడిచేతిలో ఒక రూపాయిపెట్టి గురజాడ వేంకట అప్పారావుపంతులు ఉంటూన్న ఇంటి నెంబరు అడిగి తెలుసుకొని వెళ్ళి, ఏఁరా అంటే ఏఁరా అంటూ సంభాషణకు ఉపక్రమించినట్టు, శ్రీశ్రీ ఒక ఊహాచిత్రం నిర్మించాడు. మహామహా కవులనందరినీ దర్శించుకోవాలంటే నరకానికి వెళ్ళవలసి ఉంటుందని అనటోల్ ఫ్రాంస్ చమత్కారంగా రాసిన మాటలు, బియాట్రిస్ చెయ్యిపట్టుకొని నరకంలోని వింతలను చూస్తూన్న డేంటీ మహాకవికి వెర్జిల్ మహాకవి కనిపించినట్లు డేంటీ చేసిన వర్ణన, గుర్తుకు వస్తాయి. ఇంతకూ 'స్వర్గ నరకముల ఛాయా దేహళి' భూప్రపంచకంలోని మనుషుల నివాసాలలోనే ఉన్నదని అప్పారావు చెప్పి ఉండేవాడు; శ్రీశ్రీ ఒప్పుకొని ఉండేవాడు.

శ్రీశ్రీ పుట్టిన ఐదేళ్ళలోనే గురజాడ అప్పారావు దాటుకొన్నాడు. శ్రీశ్రీ అక్షరాభ్యాసంలో అప్పారావుది కాదు మేలుబంతి. ఇరవయ్యేళ్ళ ప్రాయాన భావ కావ్యావరణం నుంచి స్వతంత్రించి విప్లవించి ఆగొన్న అలగా సందుగొందులగుండా అభ్యుదయ ఘంటాపథానికి వచ్చి చేరుకొన్న శ్రీశ్రీకి గమ్యం నిర్దేశించింది మాత్రం ("భావికి బాట”) గురజాడ గురువే. సాహిత్యానికీ ప్రజాజీవితానికీ గల బ్రహ్మముడిని గురించి వివరించిందీ ఆయనే. 'అభ్యుదయ' కవిత్వంతోటి అలా కలిసింది అప్పారావుకు పొత్తు. ఆలోగా, ఆయన జీవితావసాన వేళ సనసన్నగా తోచిన 'అభినవ' కవిత్వం చిక్కనై తెలుగుమీరి 'భావ' కవిత్వమయింది. అదీ ముదిరి 'అభావ' 'అహంభావ' కవిత్వాల పిందెలు పుట్టాయి. చెడుతూన్న చెట్టుకు కాయకల్ప చికిత్స అవసరమయింది. నులివేళ్ళతో జాతి గుండె నుంచి పీల్చి బోదె కందించి పూతకూ పింకూ పంచే జీవసారాన్ని తెలుగు కవిత్వానికి సరఫరా చేసి పోయిన కవిత్వ భిషక్కు గనుకనే అప్పారావు ఈ అన్ని మార్పులలోనూ తాను మారకుండా నిలిచిపోగలిగాడు.

'తెలుగు ప్రజల స్మృతిపథంలో అప్పారావు సదా జీవిస్తాడు. చనిపోయినప్పటికీ అతను జీవిస్తున్నాడు,' అన్నాడు కన్నీళ్లు చేతితో తుడుచుకొని గురజాడ వెంకటరామ దాసును...............

  • Title :Mahodayam
  • Author :KVR
  • Publisher :KVR Sharadamba Smaraka Kamiti
  • ISBN :MANIMN4494
  • Binding :Papar back
  • Published Date :March, 2023 3rd print
  • Number Of Pages :531
  • Language :Telugu
  • Availability :instock