Logili Books

Novels

Missing

By Malladi Venkata Krishna Murthy

₹260
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Missing
Publisher
Godavari Prachuranalu
ISBN
MANIMN4643
Binding
Papar back
Published Date
Aug, 2023
Number Of Pages
243
Language
Telugu
Availability
In Stock
About this book

మిస్సింగ్

Suspense is like a woman. The more left to the imagination, the more the excitement. -Alfred Hitchcock

ఆ రోజు కూడా సూర్యుడు బద్ధకించలేదు. నిజానికి ఆ రోజు ఇద్దరు బద్ధకించలేదు. ఒకరు ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యనారాయణుడు. రెండోవాడు హైద్రాబాద్ లోని పునీత్.

అతను చాలా సెల్ఫ్ డిసిప్లిన్ గల వ్యక్తి. తన పనిని చక్కగా నిర్వర్తిస్తూంటాడు. టివి ముందు తినడు. ఒకే మోడల్ మొబైల్ని వరసగా కనీసం మూడేళ్ళు వాడతాడు. మొబైల్ని లేండ్లైన్ ఇంట్లో ఒకేచోట ఉంచి ఉపయోగిస్తాడు. దాన్ని ప్రతీరాత్రి ఒకే సమయానికి స్విచాఫ్ చేస్తాడు. అలసిపోయినా వాకింగ్ మానడు. సూపర్ బజార్లో జాబితాలో రాసుకెళ్ళిన వస్తువులని మాత్రమే కొంటాడు. చదవాలని లేకపోయినా తన వృత్తికి చెందిన పుస్తకాలని చదువుతాడు.

పునీత్ ఎప్పటిలా ఉదయం ఐదుంపావుకి నిద్రలేచి, హల్లోని డేట్ కేలండర్లోని గురువారం, 8 జూలై 2021 తారీకు కాగితాన్ని చింపేసాడు.

మొహం కడుక్కుని తన పెంపుడు కుక్క ట్రస్టీని వాకింగ్ కి తీసుకెళ్ళాడు. ఇంట్లో ఇద్దరున్నా అది పునీత్నే తన యజమానిగా గుర్తించింది. తిరిగివచ్చాక బాల్కనీలోకి వెళ్ళి యోగాసనాలు వేయసాగాడు. పునీత్ వయసు ముప్ఫై రెండైనా పాతికేళ్ళలోపువాడిలా కనిపించడానికి కారణం, ఈ ఎక్సర్సైజే కాక అతని జీన్స్ కూడా. అతని తండ్రి, తాతలకి జుట్టు నెరవలేదు. బట్టతల రాలేదు. ఈ రెండూ మగాడి వయసుని బయట పెట్టేవే....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?