అగాదీర్ - స్వీరా - టెరూడెంట్
మొరాకో ఎప్పట్నించో నేను వెళ్లాలనుకొంటున్న దేశం- నా కలలసీమ అనడం సబబు. నే వెళ్లాలను కునే దేశాల్లో అగ్రస్థాయిలో ఉన్న ప్రదేశమది. ఆ దేశంతో అసలైన పరిచయం ఏర్పడటానికి ముందే రెండు విషయాలు నా మనసులో గూడుకట్టుకొని ఉన్నాయి: ప్రపంచంలో అతి గొప్ప యాత్రికులలో ఒకరయిన ఇబ్న్ బటూటా జన్మస్థలం మొరాకో అయి వుండటం మొదటి విషయం. నేను ఎప్పట్నుంచో ఎన్నెన్నో ఉత్తేజం కలిగించే కథలూ గాథలూ వింటోన్న మరాకేష్ (Marakesh) అన్న ఆ దేశపు విలక్షణ నగరాన్ని ఎలాగన్నా చూడాలనే కాంక్ష రెండో విషయం..................