Logili Books

Autobiography and Biography

Ruskin Bond ( O Ekanta Jeevi Bratukata)

By Dasari Amarendra

₹500
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ruskin Bond ( O Ekanta Jeevi Bratukata)
Publisher
Katha Prapancham Prachuranalu
ISBN
MANIMN7113
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
375
Language
Telugu
Availability
In Stock
About this book

ఒక సగటు మనిషి జీవితగాథ

మిరుమిట్లు గొలిపే దీపాలూ వాహనాల మహానగరంలో దారి తప్పినట్టు రాత్రి మరోసారి కల వచ్చింది. దిక్కుతోచని నిస్సహాయత ఆవరించిన దశలో ఓ చిన్న కుర్రాడు నా చెయ్యి అందిపుచ్చుకుని నాకు బాగా పరిచితమైన ఈ పర్వతాల దగ్గరకు క్షేమంగా చేర్చాడు. అలా చేర్చాక ఆ కుర్రాడు వెనక్కి తిరిగి, జేబుల్లో చేతులు పెట్టుకుని, ఈల వేస్తూ నడవసాగాడు. అతను నాకు బాగా తెలుసనిపించింది. గొంతెత్తి అతని పేరేమిటో అడిగే క్షణాన మెలకువ వచ్చేసింది.

నా మంచపు అంచున ఉన్న కిటికీ బయట ఇంకా చీకటిగానే ఉంది. మెరిసే తారలు నిండిన ఆకాశం అద్భుతంగా ఉంది. కొండల ఆవలి నుంచి మెల్లగా సోకే వెలుగు రేకల కోసం, ఆ కాంతులు ఆకాశాన్ని నీలీ బూడిద రంగులతో నింపే క్షణాల కోసం, సూర్యుడి తొలి కిరణాలు నా మంచాన్ని తాకే సమయం కోసం వేచి ఉందామనుకున్నాను. ఆ నులి వెచ్చని కిరణాల సౌఖ్యాన్ని అనుభవిస్తూ మరో గంట నిద్రపోదామనుకున్నాను.

గత కొన్ని నెలలుగా ఉదయం మూడూ నాలుగు గంటలకే మెలుకువ వచ్చేస్తోంది. బహుశా అది కలల వల్ల కావచ్చు. మళ్లా ఆ కలలకూ పెరుగుతోన్న వయసుకూ ఏదో సంబంధం ఉండవచ్చు.. వయసు పెరిగే కొద్దీ మనం పసిపిల్లలం అయిపోతాం.

ఏనాడో ఈ ఇంట్లో నివసించి, కాలక్రమేణా ఇల్లు వదిలి వెళ్లిపోయిన వాళ్లు ఆ తెల్లవారే సమయాలలో డ్రాయింగ్ రూమ్లో చేరి గుసగుసల సంభాషణలు జరపడం కూడా నాకు అంత ముందరే మెలకువ రావడానికి కారణం కావచ్చు. నేను రాతకోతలు చేసుకునే నా పడక గది లోకి ఆ చీకటి వీడని సమయాలలో వాళ్లంతా చేరి టీకప్పులూ స్పూన్ల శబ్దాల నడుమ మర్మర ధ్వనులతో మాట్లాడుకోవడం నాకు తెలుసు. కానీ వాళ్ళు నాకేమీ అసౌకర్యం కలిగించే బాపతు కాదు. వాళ్లంతా మర్యాదా నాగరికం తెలిసిన వారిలానూ, ఏ అసంతృప్తులూ లేని వారిలానూ అనిపించేవారు. వారి గత....................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?