Logili Books

Novels

Sita Ramam ( Sitaraamam)

By Ram

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sita Ramam ( Sitaraamam)
Author
Ram
Publisher
Achanga Telugu Prachuranalu
ISBN
MANIMN7159
Binding
Paparback
Published Date
May, 2026
Number Of Pages
199
Language
Telugu
Availability
In Stock
About this book

సీతాయణం

బాధ కన్నీరై నిత్యం స్రవిస్తుండగా, తట్టుకోలేక అడుగు బయటకు వేస్తున్న అభాగ్యురాలిని.

ఊపిరి కూడగట్టుకొని, తప్పదనుకుని తప్పని సరిగా మరోదారి వెతుక్కున్న బతుకు నాది.

అగుపించని అగ్ని దహిస్తూంటే, కాస్తయినా సేద దీరే అవకాశం దొరుకుతుందేమోనన్న కడపటి అశతో సాగుతూన్నక (వ్యధ)థ నాది.

నియమిత కక్ష్యలోనే భ్రమణం సాగించాలనుకున్న గ్రహన్ని నేను! కానీ, ఈరోజు కక్ష్య తప్పి పోయాను, మరో కక్ష్య ఉందో, లేదో తెలియదు. అంతలో ఏదైనా గ్రహమో, ఉపగ్రహమో ఢీకొట్టి శకలాలుగా విచ్ఛిన్నమవుతానో, లేక అంతుచిక్కని శూన్యంలో కలిసిపోతానేమో తెలియదు.

నా జీవితం నలిపేయబడ్డ కాగితం, మళ్లీ ముడతలు పోయి పూర్వస్థితిని పొందుతుందో లేదో...! మనసులోని మరవలేని గత భావపరంపరలో సమాధి అవుతానేమో కూడా తెలియదు... అదీ తెలియదు!

మధ్యాహ్నం రెండు గంటల సమయం. ఒకవైపు భయం, మరోవైపు అనుమానం, ఇంకోవైపు ఆ రెంటితో మానసికంగా అనుభవిస్తున్న నరకం. భయం ఎందుకంటే ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్లింది లేదు. ఇలా బయటకు అడుగేసిన నా నిర్ణయాన్ని సమాజం హర్షిస్తుందో లేదో అన్న అనుమానం. కచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం! ఈ భయం, అనుమానం రెండూ కలిసి మనసును ఛిద్రం చేస్తున్న నరకం మాత్రం దూరం అవడంలేదు. అందుకనే, గర్భగుడిలో దైవాన్ని విడిచి కాదు, దైవమని భావించిన ఉన్మాది నుంచి తప్పించుకోవడానికి మొదటి మెట్టును దాటబోతున్నాను. ఉన్మాది అన్న ఆలోచన వచ్చిందో, లేదో కన్నీళ్ళ ప్రవాహం ఆగట్లేదు. ఒకప్పుడు నా మనసులో కొలువైన దేవుడు అతను. మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న సూట్ కేసు అన్ లాక్ చేశాను. దాని లోపల కనిపించినదాన్ని చూసి.............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?