Logili Books

Buddhism

Sutta Pitaka Majjhimanikaya- 1st part Mulapannasapali

By Bikshu Darmarakshita

₹800
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sutta Pitaka Majjhimanikaya- 1st part Mulapannasapali
Publisher
Mahabhodi Buddha vihara Hyd
ISBN
MANIMN3672
Binding
Hard Binding
Published Date
May, 2019
Number Of Pages
695
Language
Telugu
Availability
In Stock
About this book

నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుస్స

మట్టిమనికాయ - మూలపక్షాసపాలి

1. మూలపరియాయ వర్గం

1. మూలపరియాయ సూత్రం

 

  1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు ఉక్కట్లలో సుభగవనంలో సాలవృక్షరాజం మొదట ఉన్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను - "భిక్షువులారా" అని పిలిచాడు. "భదంతా" అని వారు భగవానునికి బదులు పలికారు. భగవానుడు - "భిక్షువులారా, సర్వధమ్మమూలపరియాయాన్ని ఉపదేశిస్తాను. మనస్సును చక్కబరచుకొని వినండి చెపుతాను" అన్నాడు. "అలాగే భంతే" అని | ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇట్లన్నాడు -

2 "భిక్షువులారా, ఇక్కడ, (ధమ్మాన్ని గురించి) విననివాడు, ఆర్యులను (శ్రేష్ఠులను) చూడనివాడు, ఆర్యధమ్మంలో నిపుణుడు కానివాడు, ఆర్వధమ్మంలో శిక్షితుడు కానివాడు, సత్పురుషులను చూడనివాడు, సత్పురుషధమ్మంలో నిపుణుడు కానివాడు, సత్పురుషధమ్మంలో శిక్షితుడు కానివాడు - భూమిని భూమిగా గుర్తుపడతాడు; భూమిని భూమిగా గుర్తించి, అతడు తనను భూమి అనుకొంటాడు, తనను భూమిలో అనుకొంటాడు. భూమినుండి అనుకొంటాడు. భూమి నాది అనుకొంటాడు. భూమిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? 'దానిని తెలియకపోవటం వల్లనే' అని చెపుతాను.

-నీరుని నీరుగా గుర్తుపడతాడు; నీరుని నీరుగా గుర్తించి, తనను నీరు అనుకొంటాడు, నీరులో అనుకొంటాడు. నీరునుండి అనుకొంటాడు. నీరు నాది అనుకొంటాడు. నీటిలో ఆనందిస్తాడు. అందుకు | కారణమేమి? దానిని తెలియకపోవటం వల్లనే' అని చెపుతాను.

"అగ్నిని అగ్నిగా గుర్తుపడతాడు; అగ్నిని అగ్నిగా గుర్తించి, తనను అగ్ని అనుకొంటాడు, అగ్నిలో అనుకొంటాడు, అగ్నినుండి అనుకొంటాడు, అగ్ని నాది అనుకొంటాడు, అగ్నిలో ఆనందిస్తాడు. అందుకు కారణమేమి? దానిని తెలియకపోవటం వల్లనే' అని చెపుతాను..........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?