సింథసిస్ ఆఫ్ యోగ
భారతదేశంలో పుట్టిన మనం చాలా అదృష్టవంతులం కాని ఒక విధంగా దురదృష్టవంతులం కూడా. అదృష్టవంతులం ఎందుకంటే మనకి వారసత్వంగానే చాలా చాలా ప్రాక్టికల్ విజ్మ్ లభించింది. నాలెడ్జ్ అనటం లేదు విజమ్ అనే పదం వాడుతున్నాను. అది మన అదృష్టం. అద్భుతమైన ప్రజ్ఞ దానినే పతంజలి యోగ సూత్రాలలో ఋతంభరా
ప్రజ్ఞ అంటాం, సమాధిస్థితి అంటాం. అది ఒక విశేషమైన మానసిక స్థితి. ఆ మానసిక స్థితి యొక్క లక్షణాలు రెండు అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. 'గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః' ఆ ప్రజ్ఞ యొక్క మొదటి లక్షణం. ఇది "3 ఇన్ 1'.
బ్రాహ్మీశక్తి - సృజనాత్మకత. సృజనాత్మకత యొక్క పరాకాష్ట ఈ ప్రపంచాన్ని చూస్తే అర్ధమవుతుంది. ఆదిలో విష్ణువు యొక్క నాభి..................