Logili Books

Novels

Tatacharla Kathalu ( C P Brown)

By Bangore

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Tatacharla Kathalu ( C P Brown)
Author
Publisher
Classic Books
ISBN
MANIMN7077
Binding
Paparback
Published Date
Aug, 2026
Number Of Pages
563
Language
Telugu
Availability
In Stock
About this book

ముందుమాటలు

కొండను త్రవ్వి ఎలుకను పట్టడం నా చేతకాదు. అది నా తత్వమూ కాదు, ఎలుకను తవ్వి, కాదంటే, దువ్వి కొండను కొట్టడం లేదా కొల్లగొట్టడం నాకు నచ్చిన పని. ఇదేదో పిహెచ్.డి. డిగ్రీకోసం పడే కక్కూర్తి కాదు. ఏదో పవిత్ర బాధ్యతగా ఎంచి అందులో ఐక్యమైపోయే ఒక లౌల్యం.

మన పిహెచ్.డి. పండితులు పనికిరావని పారవేస్తున్న. నిరాదరిస్తున్న అంశాలు కొన్నిటిని పట్టుకొని ఏగులాడడం నావంతు అయినట్లున్నది. గతంలో నా చేసిన రచనల్లో ఇదే జరిగింది, ఇప్పుడు బ్రౌన్ విషయంలోనూ ఇదే జరిగింది.

ఒకరిద్దరు ఆచార్యులతో ఇదే అంటూ వచ్చాను, ఓ ఆచార్య వర్యులారా! బ్రౌన్ గురించి ఇంకా శోధించవలసింది చాలా ఉంది, మన సాహిత్య చరిత్రను తిరిగి వ్రాయవలసిన అవసరం చాలా ఉంది. ఈ విషయాలను కొంచం పట్టించుకోండి. మీ శిష్యుల్ని ఈ పనికి పురమాయించండి - అని అంటే వాళ్లు పట్టించుకొన్న పాపాన పోలేదు.

మొన్నీమధ్య ఒక ప్రభుత్వ కాలేజి లెక్చరర్ నావద్ద కొచ్చి మాటల సందర్భంలో - ఏదైనా ఒక రీసెర్చి టాపిక్ చెప్పండి సార్ అని అడిగాడు. ఒక్క సి.పి. బ్రౌన్ను గురించి, ఆనాటి విషయాలను గురించి అరడజన్ పిహెచ్.డి. డిగ్రీలు తీసుకోదగినంత సమాచారం ఉంది మహాశయా. ఉదాహరణకు, నీకు ఓపికుంటే ఆ దృష్టి ఉంటే, 'బ్రౌన్ సంతరించి పెట్టిన తాతాచార్ల కథలు - వాటిలోని చరిత్రాది విషయాలు" అనే అంశం తీసుకొని చెయ్యొచ్చు - అన్నాను. మీది మరీ విడ్డూరంగా ఉంది సార్ ! ఎవరో ఊరు పేరు లేని కోన్కిస్కా తాతాచార్లేమిటి? ఆయన కథ లేమిటి? వాటిలో చరిత్రాది అంశాలేమిటీ? ఇంత అసందర్భమైన మాటంటే మా ప్రొఫెసర్ల చెవుల కెక్కుతుందా? - అని పెదవి విరిచాడు ఆ లెక్చరర్ మహాశయుడు.

ఈ మాటన్న నాలుగు రోజులకు 1973 అక్టోబరు 30 తేదీన, అంతకు పదిరోజుల ముందర పూర్తయిన నా "బ్రౌన్ జాబులు - తెలుగు జర్నలిజం చరిత్ర (1832 నుంచి 1857 దాక" అనే పుస్తకం కాపీ ఒకటి ప్రెజెంట్ చేద్దామని శ్రీ యం.యన్. రావు దగ్గరకు వెళ్ళాను. ఆయన బ్రౌన్ తాతాచార్యుల కథలు ఎడిట్ చేసి పెడ్తారా అని సూటిగా అడిగారు, చేయనని ఎట్లా అనేది? అది నా ప్రియమైన విషయం. తప్పక చేసిస్తాను, కాస్త టైమివ్వండి - అని అన్నాను............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?