• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugu Basha Vaithalikulu Gurujada Gidugu

Telugu Basha Vaithalikulu Gurujada Gidugu By Perisetti Srinivasarao

₹ 350

విశ్వ విద్యాలయాలు: సంస్కృత, మాతృభాషలు

 

గురజాడ అప్పారావు

మద్రాసు విశ్వ విద్యాలయంలో సంస్కృత భాషా బోధన సత్ఫలితాలకు దారితీయ లేదనీ, మాతృభాషల అధ్యయనం విఫలమయిందనీ సాధారణంగా అందరూ చెబు తున్నారు. యివి యిలాగున ఎందువలన పరిణమించినవో కారణాలను తెలుసుకునేందుకు యిటీవలనే విచారణ ఆరంభమయింది. అయితే యీ పరిశీలన యింకా ముగియకుండానే గవర్నమెంటు చేసిన గ్రాంటును యెలాగున వినియోగించాలనే సమస్య నిర్ణయింపబడవలసి వచ్చింది.

ఎలిమెంటరీ, మిడిల్, హైస్కూళ్ళలో చెప్పే విద్య నుంచి కాలేజీలలో బోధించే పాఠ్య విషయాల్ని వేరుచేసి దేనికది స్వతంత్రమైనదని మనం వీటిని పరిశీలించ కూడదు. అలా అయితే తీర్థానికి తీర్థమే ప్రసాదానికి ప్రసాదమే! స్కూళ్ళల్లో చెప్పే విద్య గట్టి పునాదుల మీద లేనపుడు కాలేజీలలో బోధించే విద్యను గురించి మనం పెద్ద పెద్ద పథకాలు, ప్రణాళికలు వేసి లాభం లేదు.

సంస్కృత, మాతృభాషలను కళాశాలలలో ఏలాగున బోధించాలనే విషయం చర్చించినది వాటిని క్షుణ్ణంగా తెలిసిన పండితులుకాదు. ఆ భాషలలో అభినివేశం లేనివారు కేవలం ఊహలతో తమకు తెలియని వాటిని గురించి మిడిమిడి జ్ఞానంతో చర్చించారు. ఆధునిక విద్యాబోధనా పద్ధతులంటే ఎలా వుంటాయో వాటి ముక్కూ మొహమూ తెలియనివారు యిలాయిలా వుండాలని గీట్లుగీసి మరీ మరీ చెబుతున్నారు. పాండిత్యానికి కావలసిన ఆధునిక జ్ఞానం వీరిలో మృగ్యం, చెన్న రాష్ట్రంలో సంస్కృత - మాతృభాషల పాండిత్యమున్న చాలా. ఆ భాషల స్వరూప స్వభావాలను తెలియనివారు అతి............

  • Title :Telugu Basha Vaithalikulu Gurujada Gidugu
  • Author :Perisetti Srinivasarao
  • Publisher :Akshara Sahity Samsrutika Sevapetam
  • ISBN :MANIMN5068
  • Binding :Papar back
  • Published Date :2018
  • Number Of Pages :223
  • Language :Telugu
  • Availability :instock