Logili Books

Short Stories

Ammamma Gaari Kashiyatra

By Dr Maddali Usha Gayatri

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ammamma Gaari Kashiyatra
Publisher
Kinnera Publications
ISBN
MANIMN3778
Binding
Papar back
Published Date
Feb, 2022
Number Of Pages
256
Language
Telugu
Availability
In Stock
About this book

ఇంటింటి చిత్రాలు

నృత్యకిన్నెర ఉషాగాయత్రి కథాకిన్నెరగా పాఠక లోకానికి అందించిన కథాసంపుటి 'అమ్మమ్మగారి కాశీయాత్ర' ఇందులోని కథలు సామాజిక, కుటుంబ వ్యవస్థలపై అవగాహనతో అద్దం పట్టినవి. ఈ సంపుటిలో 27 కథలున్నాయి. ఇవి కరోనా కథలు, గురుశిష్య సంబంధకథలు, వివాహహేతర సంబంధ కథలు, సరదా కథలు ఇలా విభిన్నమైనవి.

ఈ కథల్లోని స్త్రీ పాత్రలు స్త్రీల ఆలోచనా ధోరణలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఈ కథల్లో పురుషులందు పుణ్యపురుషుల్లాంటి వారూ ఉన్నారు.

'నూతన బంధం' అనే కథలో సీతారామ్ వ్యక్తిత్వం చాలా ఆదర్శప్రాయమైంది. ముగ్గురు పిల్లల తండ్రి. ధనవంతుడైన సీతారామ్ తనకన్నా 14 ఏళ్ళ చిన్న అమ్మాయిని పెళ్ళాడలనుకున్నా, సుశీల ప్రవర్తన అర్థమయ్యాక, ఆ అమ్మాయిపై భార్య కాబోతుందనే భావంతో ఏ చనువు తీసుకోక పోవటమే కాదు. ఆ అమ్మాయి తన పెద్ద కూతురు అనే భావం మనసులో కలిగి, ఆ అమ్మాయిని మంచి కుర్రవాడికిచ్చి పెళ్ళిచేసి, తన సంపద సద్వినియోగం చేయాలనుకోవటం సీతారామ్ సంస్కారానికి జోహార్లు అర్పించాల్సిందే. ఇలాంటి పురుషులు సమాజంలో వుంటే ఏ స్త్రీకయినా అభద్రతాభావం వుండదు. పైగా సీతారామే ఆమెకు సంరక్షకునిగా వుంటాననటం అతని వ్యక్తిత్వంలో విశేషం.

వివాహేతర సంబంధాలలో స్త్రీ పురుషులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనే అంశంపై చాలా కథలున్నాయి. ఈ సంపుటిలో ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకునే సమయంలో అతని పెళ్ళయింది. ఆ విషయం..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?