• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Oka Prema Katha, Oka Pelli Katha

Oka Prema Katha, Oka Pelli Katha By Potturi Vijayalakshmi

₹ 250

ఒక ప్రేమకథ! ఒక పెళ్ళి కథ!!

ఫోం పరుపుమీద పడుకుని వెచ్చగా బ్లాంకెట్ కప్పుకుని గాఢనిద్రలో ఉన్న కల్యాణ్ ఫోన్ మోతకి నిద్రలేచాడు. బద్దకంగా లేచి వెళ్ళి ఫోన్ అందుకుని 'హల్లో' అన్నాడు మత్తుగా.

"హలో కల్యాణ్ హేపీ న్యూ ఇయర్" అంది ఓ కోమల కంఠం.

తెల్లబోయాడు కల్యాణ్ ఎవరా అనుకుంటూ, "థాంక్యూ, బైదిబై ఎవరు మీరు?"అన్నాడు.

దీర్ఘమైన నిట్టూర్పు! "ఎవరని చెప్పను డార్లింగ్? నీ అభిమానిని. నిన్ను అనుక్షణం ఆరాధించే అభిమానిని. నీ కడగంటి చూపు కోసం పడిగాపులు పడే నిర్భాగ్యురాలిని.” దీనంగా ధ్వనించింది ఆ కోమల కంఠం.

ఆశ్చర్యపోయాడు కల్యాణ్. "మీరూ? రాంగనంబర్ కి ఫోన్ చేశారేమో?” అనుమానంగా అడిగాడు.

కిలకిల నవ్వింది ఆ అమ్మాయి. "కాదు అసలయిన వారికే ఫోన్ చేశాను. ఏం నమ్మకంగా లేదా? నేను నిజంగా మీ అభిమానిని.”

"నిజం?" నమ్మశక్యం కానట్లు అడిగాడు కల్యాణ్.

"నిజం. అయినా అంత ఆశ్చర్యం ఎందుకో? మంచి టెన్నిస్ ప్లేయరు. మంచి గాయకులు, బాంక్ ఆఫీసరు, ఆస్థిపరులు. అన్నిటినీ మించి అందమైనవారు అయిన మీకు నాలాంటి అభిమాని ఉండకూడదా? "చిలిపిగా అడిగింది.

హఠాత్తుగా భలే సరదా వేసింది కల్యాణికి. జీవితంలో ఏదో కొత్త అనుభవం. ఇన్నాళ్ళూ ఫ్యాన్స్ లేరు. గొప్పవాళ్ళందరికీ బోలెడంతమంది అభిమానులుంటారు. అసలు అభిమాని అంటే ఎలా ఉంటుందో? 

"ఏమిటీ మాట్లాడరేం నిద్రపోతున్నారా?” కొంటెగా అడిగింది ఆ అమ్మాయి.

అదిరిపడ్డాడు కల్యాణ్.

"అబ్బే అదేంలేదు. ఊరికే ఏదో ఆలోచనలో మునిగిపోయాను" అన్నాడు.............

  • Title :Oka Prema Katha, Oka Pelli Katha
  • Author :Potturi Vijayalakshmi
  • Publisher :Potturi Vijayalakshmi
  • ISBN :MANIMN5871
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2024
  • Number Of Pages :237
  • Language :Telugu
  • Availability :instock