• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Practical Test

Practical Test By Ramana Sri

₹ 100

ప్రాక్టికల్ టెస్ట్



1977 ఆగష్టు 22 రాత్రి

"మనం బయలుదేరి వారం రోజులయింది కదూ!" నిండు పున్నమి వెన్నెలలో వాచీ చూసుకుంటూ అన్నాడు విలియం.

"అవును. వారం రోజులూ నిమిషాలలా గడిచిపోయాయి. ఎంత హాయిగా వుందో! ఇలాగే జీవితాంతం వుండాలనిపిస్తోంది" డెక్ మీద ఫోల్డింగ్ చెయిర్లో కూర్చొని సిగరెట్ త్రాగుతూ అన్నాడు కాంతారావు.

"ఈ మన ప్రయాణం విజయవంతమయితే ప్రపంచంలో నూతన శకం ఆరంభమ వుతుంది" కాఫీ కలుపుతూ అంది లూసీ,

ఏం మాట్లాడకుండా గంభీరంగా సముద్రం వైపు చూస్తూ కూర్చొని ఉన్నాడు ప్రొఫెసర్

జయరాం

పున్నమిచంద్రుడు నీళ్ళ మీద నృత్యం చేస్తున్నాడు. వెన్నెల తెల్లని దుస్తులలోవున్న యూరోపియన్ యువతిలా ఉంది. కనుచూపు మేరలో ఎటుచూసినా సముద్రమే! ఆ సువిశాల సముద్రంలో ఆ నలుగురు ఓ మెషీన్ బోటుమీద గమ్యంలేని ప్రయాణం చేస్తున్నారు.

2

కాంతారావు ఓసారి విలియం, లూసీల వైపు చూసి చిన్నగా నవ్వుతూ చెప్పసాగాడు. అదే సమయంలో సైకాలజీ ప్రొఫెసర్ జయరాం గారు ఆ గదిలోకి ప్రవేశించారు. ప్రొఫెసర్ని చూసి ఆ ముగ్గురూ విష్ చేశారు. ప్రొఫెసర్ ప్రతిగా విష్ చేసి ప్రక్కనే వున్న ఈజీ ఛెయిర్లో కూలబడ్డారు.

"నేడు మనలో గూడు కట్టుకొని పోయిన ఈ అరిష్టాలకు, అవి అప్పుడప్పుడు వెర్రి తలలు వేయడానికి, ఈ సంఘమెంత దోహదం చేస్తుందో మీకు ఒక సంఘటన ద్వారా తెలియచేస్తాను." కాంతారావు చెప్ప సాగాడు. అంతా శ్రద్ధగా వింటున్నారు...................

  • Title :Practical Test
  • Author :Ramana Sri
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN6342
  • Binding :Papar Back
  • Published Date :June, 2025
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock