రాక్షస సంహారం
No trait is more justified than revenge in the right time and place. Meir Kahane
'ఈగిల్ ఫార్మాస్యూటికల్స్ ప్రయివేట్ లిమిటెడ్' బోర్డ్ మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్ కి హాజరైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్పటికే తమకి అందిన ఏన్యువల్ అకౌంట్స్ని చదివారు. వాళ్ళ కంపెనీ స్థాపించిన ఐదో ఏట కూడా నష్టాలే.
అకౌంట్స్ ప్రకారం ఇక అప్పులు తప్ప ఆస్థులు కాని, పెట్టుబడి కాని లేవు. ఆ బోర్డ్ మీటింగ్కి హాజరైన కాళీమోహన్, భూపతి ఆ విషయం చర్చించుకున్నారు. "మనం ఓ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు." భూపతి చెప్పాడు.
"అదెలాంటి నిర్ణయమైనా సరే, లాభసాటి నిర్ణయమై ఉండాలి.” కాళీమోహన్ ‘లాభసాటి'ని నొక్కి చెప్పాడు.
"నాకున్నదంతా పెట్టేసాను. ఆ పెట్టుబడి పోతే నేను మళ్ళీ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ బతకాలి తప్ప వేరే ఆధారం లేదు. నేను స్టెతస్కోప్ పట్టుకుని ఏడేళ్ళు దాటుతోంది. కొత్తగా ఎం.బి.బి.ఎస్. పాసై ప్రాక్టీస్ పెట్టే డాక్టర్కి, నాకూ ఆట్టే తేడా. ఉండదు." భూపతి చెప్పాడు.
"లెటజ్ థింక్ ప్రాక్టికల్లీ, నువ్వు మళ్ళీ డాక్టర్ బోర్డ్ తీసి దుమ్ము దులపాలి అన్న నిజాన్ని ఎంత త్వరగా అంగీకరిస్తే అంత త్వరగా మనం లిక్విడేషన్ కోసం ప్రయత్నం చేయచ్చు. ఆలస్యమైన కొద్దీ రూపాయికి పైసా కూడా రాకుండా పోతుంది. ఈగిల్................