• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sanatanam
₹ 280

భాగం-1

మహార్లు కేకలు వేస్తున్నారు. నోటి మీద అరచేతిని అడ్డంగా పెట్టుకుని కేక వేయటం ప్రత్యేకత. హెూలీ రోజున వెలువడే కేకలు-అరుపులు. మహర్వాడలో హెూలీ దహనానికి ఇది గుర్తు. అంటరానివాళ్ల పిల్లలు అల్లరిగా, కావాలనే ఇలా కేకలు వేస్తున్నారు. మరో రోజు అయివుంటే ఇలాంటి కేకలు-అరుపులు అశు భంగా భావించి ప్రజలు భయంతో వణికిపోయేవారు. అయితే ఈ రోజు, అంటే హెూలీ రోజున మారుమ్రోగుతున్న ఈ కేకలు శుభసూచకాలు. హెూలీ పండుగే కేకల అరుపుల పండుగ, మహార్ణ మనసులోసంతోషం పొంగుతోంది. మహార్లందరూ మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు. కేకలు వేస్తున్నారు.

భీమ్నాక్ మహార్ హెూలీ మంటకు దగ్గర్లో పనికిరాని, ఎండిపోయిన గడ్డిని పోగుచేసి వేస్తున్నాడు. సిడ్నాక్ మహార్ మంటను ఎగదోస్తున్నాడు. అక్కడున్నవారిలో వీళ్లిద్దరే యవ్వనంలో అడుగుపెట్టిన యువకులు. పిల్లలు వీళ్ల మాటలు వినేవారు. మహర్వాడ మహిళలు పూజా పళ్లేన్ని పట్టుకుని పూజలు చేయడానికి వస్తున్నారు. చింతచెట్టు కింద కూర్చుని ముసలివాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. 'ఈ సంవత్సరం హెూలీ గొప్పగా జరిగింది' అని ఏసనాక్ మహార్ చింత చెట్టుకాండానికి తన వీపును రుద్దుకుంటూ అన్నాడు. అతను 'సింగా' అనే కొమ్ము వాద్యం వాయించేవాడు. అందువల్ల అందరూ అతడిని 'సింగ్యా' అని పిలిచేవారు. “అరే, దూరంగా జరగండి. దగ్గరగా రాకండి. ఒళ్లు కాల్చుకుంటారు" అని అంబర్నాక్ మహార్ హెూలీ కాలుస్తున్న.....................

  • Title :Sanatanam
  • Author :Ranganatha Ramachandra Rao
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN5708
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2024
  • Number Of Pages :236
  • Language :Telugu
  • Availability :instock