"స్పర్శ రేఖలు"
అయిదడుగులా పదంగుళాల ప్రశ్నార్థకం పళని? నా ఎట్టెదుటే పదిమందితో మాట్లాడ్తూ పది రకాలుగా కనిపించే... పళని.
కాని రంగు అడ్డపంచా తెల్లటి ఖాదీ అరచొక్కా... రిమ్లెస్ అద్దాలూ.... నున్నగా గొరిగిన మూతీ....
రోజుకు రెండు సార్లు షేవ్ చేసుకుంటూ మసకపాచిరంగులీనమైన ఎర్రటి ఎరుపుతో... మెరుస్తూన్న గడ్డమున్న పళని ఇన్నేళ్లుగా చూస్తున్నా.... ప్రతిరోజూ సరికొత్తలా కనిపించే పళని....
శివాలయం ప్రహరీ కోసం పాతికవేలు చందా రాస్తూ శివుడి మీద బూతు జోకులేసే పళని...
అరక్షణంలో హోటేల్లో గుమికూడిన కష్టమర్లని విడివిడిగా గుర్తిస్తూ... అరమోడుగా కళ్ల చివర్లనించీ నన్ను చూసి నవ్వీ నవ్వక... నవ్వి...
పేరు కూడా తెలీని దేముళ్ల నిలువెత్తు ఫోటోలకి గుప్పెడగరొత్తులు వెలిగించి ధూపమేస్తూ పళని కిచెన్ వేపు చేతులు రెండూ అగరొత్తుల్తో సహా చూపుతూ... పళని....
నేను తలూపుతున్నట్టుగా ఓ జెస్చెర్ చేసి... కిచెన్గుండా వెనక వేపున్న గదిలో......................