Logili Books

Novels

Divya Tejam

By Veluri Krishna Murty

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Divya Tejam
Publisher
Pala Pitta Books Hyd
ISBN
MANIMN6271
Binding
Papar Back
Published Date
March, 2025
Number Of Pages
368
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రజాతంతుం మా వ్యవచ్ఛేథ్సీ:

ఆచార్య శివగురు ప్రాతఃకాలపు అగ్ని ఉపాసన కార్యం నెరవేర్చి యాగశాల నుండి బయటికి వచ్చారు. వాకలి వద్ద నిలబడ్డ సేవక జనులు ఆచార్యులవారికి అభివాదం చేశారు. ప్రసన్న వదనంతో వారిని ఆశీర్వదించిన ఆచార్యులు బయట వున్న పడసాలుకు వచ్చారు. కొందరు విద్యార్థులు సుశ్రావ్యంగా తైత్తిరీయ ఉపనిషత్తును పరిస్తున్నారు. 'శిక్షావల్లి' అంతిమ ఘట్టపు 'శిష్యానుశాసనం' వల్లెవేస్తున్నారు. మంత్రాలు వింటూ శివగురు ఒక క్షణ కాలం అలాగే నిలబడ్డారు.

సత్యం వద

ధర్మం చర

స్వాధ్యాయాన్మా ప్రమదః

ఆచార్యాయ ప్రియంధనమాహృత్య,

ప్రజాతంతుం మా వ్యవచ్ఛేథ్సీ:

సత్యాన్ని ప్రముదితవ్యం

ధర్మాన్న ప్రమతవ్యం

ఇలా సాగింది ఉపనిషత్ మంత్రఘోష, కాని శివగురుగారి చెవులలో విశేషంగా 'ప్రజాతంతుం మా వ్యవచ్చేథ్సీః' పాదం మరల మరల ప్రతిధ్వనించింది. ప్రశాంతతో వున్న వారి మనసు ఆ వాణి ఆదేశం విన్న మీదట చంచలమైంది. ప్రసన్నమై వున్న వారి మనసు గంభీరమైంది. అంతర్ముఖమైంది.

ఔను, ఆ క్షణంవరకు శివగురు సంతానం గురించి ఆలోచించలేదు. తమకు బిడ్డలు కాలేదన్న చింత వారికి వుండలేదని కాదు. ఎపుడైనా ఒకమారు బంధువుల యిళ్ళకు వెళ్ళినపుడు వారి యిళ్ళలో పిల్లల ఆట పాటలు చూచినపుడు, తమకు కూడ | పిల్లలు వుంటే బాగుండేది కదా? వారి ముద్దు ముద్దు మాటలు.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?