Logili Books

Novels

Agnyaathavaasi

By Simha Prasad

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Agnyaathavaasi
Author
Publisher
Anvikshiki Publishers
ISBN
MANIMN5602
Published Date
2024
Number Of Pages
215
Language
Telugu
Availability
In Stock
About this book

గంధర్వ కన్య

చిక్కని చీకటి చీల్చుకుంటూ ఎన్నో ఖరీదైన వాహనాలు మహానగరం నుంచి అవుట్స్కర్ట్ వైపు పరుగులు తీస్తున్నాయి.

వాటి గమ్యం - 'స్వర్గం!'

సామాన్యులకు ఒక ఫామ్ హౌస్ ని, నిజానికదో విలాసవంతమైన బంగళా. అన్ని హంగులూ, సౌకర్యాలూ అపూర్వ సెక్యూరిటీ గల భవన సముదాయం!

దాని అధినేత విశ్వమూర్తి ప్రముఖ వ్యాపారవేత్త. అతడు ప్రముఖుల్ని ఆనందసాగరంలో ముంచి తేల్చే విందు వినోదాలన్నీ అక్కడే ఇస్తుంటాడు.

అవాళ అతడి 58వ పుట్టినరోజు. నగరంలోని రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, సినీ, మీడియా రంగాల ప్రముఖులు వచ్చారు. వస్తున్నారు. వారంతా అతడికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అండదండలందించేవారే! అందుకుంటున్నవారే!

రేవ్ పార్టీని తలదన్నేలా ఇచ్చే అతడి పార్టీలకు ఆహ్వానం అందితే చాలు ఎవరూ వదులుకోరు.

అక్కడ అందని ఆనందం, దక్కని సౌఖ్యం ఉండవు. స్వర్గ సుఖాలన్నీ అక్కడ అరచేతిలో కొచ్చి అక్షరాలా వాలతాయి.

ఉర్రూతలూగించే సంగీతం, అర్థనగ్న నృత్యాలు, స్వదేశీ విదేశీ మద్యాలు, కొన్ని రకాల మత్తు పదార్థాలు, విభిన్న రుచులు వంటకాలు స్వాగతం పలుకుతాయి. ఇక అలరించే వయ్యారి భామలకు కొదవే వుండదు. ఎలాంటి వారి చేత నైనా ‘మడి’ విప్పేయిస్తారు!..............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?