Logili Books

Literature

Kaaparulu- Vaamapaksha Kalakaarula Gurinchina saannihitya Rachana

By Jillella Balaji

₹220
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kaaparulu- Vaamapaksha Kalakaarula Gurinchina saannihitya Rachana
Publisher
Nava Chetan Publishing House
ISBN
MANIMN5835
Binding
Papar Back
Published Date
Feb, 2024
Number Of Pages
227
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రశ్న: నమస్తే బవా. మీరు రాసిన రెండు కథానికా సంపుటాలను చదివిన అనుభవంతో మీ యవ్వనకాలాన్ని గురించిన కొన్ని చిత్రాలను మనసులో చిత్రీకరించుకోవటానికి వీలైంది. మీ మనసులో ఇంకా పచ్చిగా ఉండే ఆ యవ్వనకాల జ్ఞాపకాలను మాతో పంచుకోగలరా?

జ: నా బాల్యం దేవతలచేత ఆశీర్వదించబడ్డదే. నాన్న సెకండరీ గ్రేడ్ టీచరు. తిరువణ్ణామలైకు సమీపంలో ఒక గిరిజనుల తెగ ఉంది. నాన్న ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టరుగానూ, వార్డన్ గానూ ఉండేవారు. హెచ్చెమ్ కొడుకు అన్న ప్రత్యేక అభిమానంతో ఆ తెగ ప్రజలతో కలిసిమెలిసి తిరిగేవాణ్ణి. వాళ్లతో కలిసి ఎలుకల్ని పట్టటానికి వెళ్లటం, ఎండ్రకాయ బొరియల్లో చేతుల్ని దోపి నీటిపాముల్ని లాక్కొని రావటం, మంచి పాముల్ని లాఘవంగా పట్టుకోవటం, నీటి పాయల్లో నీటిని అడ్డగించి చేపల్ని జవురుకోవటం, చీకటి పడేంతవరకూ ఆ తెగ అమ్మాయిలతో దాగుడుమూతలు ఆడటం అంటూ ఇప్పటికీ జ్ఞాపకాల్లో తియ్యనైన బాల్యం నాకు లభించింది. ఆ జ్ఞాపకాలే నా “ఓణాన్ కొడి సుట్రియ రాజాంబాళ్ నినైపుగళ్ (ఓణాన్ కొడి చుట్టూ తిరిగిన రాజాంబాళ్ జ్ఞాపకాలు)

అప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా శ్వాసించిన రాజాంబాళ్ నుండి తేలి వచ్చిన సువాసనను ఇన్నేళ్ల తర్వాత కూడా గ్రహించగలుగుతున్నాను. దాన్ని గ్రహిస్తున్నంత కాలం ఆ రోజుల్ని గురించి రాయటానికి వీలవుతుంది కదా?

ప్ర: మీ కథానికల్లో వచ్చే నాన్న(పాత్ర)ల్లో తనను తాను కృశించుకొని కొడుకుని పెంచుతారు. మరొక కథలో చాలా కఠినమైన నాన్నలా ఉన్నారు. మీ నాన్నగారు ఎలాంటివారు? నాన్న అనగనే మీ జ్ఞాపకాల్లో ఉండే సంఘటనలు కొన్నింటిని చెప్పగలరా?

జ: నాన్న ''అందరి కొడుకులకు లాగానే నాకూ అన్నీ తానై ఉన్నారు. నేనెప్పుడూ ఆయన ఇనీషియల్ను రాయటం లేదని తెలుసుకుని నీ..................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?