Logili Books

Short Stories

Vandrevu Chinaveerabhadrudu Aa Vennela Ratrulu

By Vandrevu Chinaveerabhadrudu

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vandrevu Chinaveerabhadrudu Aa Vennela Ratrulu
Publisher
Sri Pada Litarary Works
ISBN
MANIMN6889
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
284
Language
Telugu
Availability
In Stock
About this book

అడవికి చెల్లించిన గురుదక్షిణ

చినవీరభద్రుడిగారి కవితల మీదుగా సహృదయమిత్రులు రాస్తున్న పరామర్శలన్నీ చూస్తూ ఉన్నాను. ఒకే మనిషిని ఒక్కొక్కరం ఒక్కో స్తరంలో చూస్తాం కనుక నావొక నాలుగు మాటలు కలిపే ప్రయత్నం ఇది.

నేను కవిత్వం చదివి అర్థం చేసుకోగల పాఠకురాలిని కాకపోయినా భద్రుడిగారి కొన్ని కవితలూ ముఖ్యంగా ఎక్స్ప్రెషన్సు తలచుకోని కాలాలు అరుదు. వేపపూలగాలి, ఫాల్గుణమాసపు చంద్రుడు, శరత్పూర్ణిమ, కనిపించని కోయిల పాట, ఆలస్యంగా పూయడం వల్ల ఇంకాస్త ఎదురుచూసేలా చేసే మా ప్రాంతపు వేపపూత ఇట్లాంటివెన్నో ఆ మనిషి ప్రకృతిసంబంధి అనిపించేలా మాయ చేస్తాయి. అంతలో 'పునర్యానం' లో వినమ్రపు భరతవాక్యంగా 'వాక్కుకి కృతజ్ఞతలు, మాటలకి కృతజ్ఞతలు' అని మొదలుపెట్టి చెల్లించిన కృతజ్ఞతలు చదివాకా జ్ఞానసంబంధి కావడమే పడుతుంది నాకు ఎక్కువగా.

పోయినేడాది కుదిరినంతకాలం అన్నిరకాలైన సాంఘికమాధ్యమాలకూ వీలైనంత దూరం జరిగాను, ఆ కాలంలోనూ వదలని ఒకే బ్లాగు చినవీరభద్రుడిగారిదే. ప్రతీ ఉదయం తన చదువరి సిద్ధమయ్యేలోపు ఆ రోజు పోస్టును కానుక చేసేవారు. ఒక విషయమా!! ఒక జాన్రాలో ఒదిగే సంగతులా!! ఒక స్థాయికి కుదించగల విస్తృతా!! వేకువనే ఆ పోస్టు చదువుకుని ఒక మాట చెప్పో ఎక్కువసార్లు ఏమీ చెప్పకుండానో రోజు మనకు చూపించబోయే కళల్లోకి నెమ్మదిగా ఒదిగేపోయేలా చేసిన మెడిటేటివ్ అనుభూతి నా వరకూ.

'దివ్యప్రేమగీతాల'తో మొదలయ్యి, 'పోస్టు చేసిన ఉత్తరాలు', 'బసవపురాణం ప్రసంగాలూ', 'బసవన్న వచనాలు', 'ఆషాఢమేఘం', కల్యాణి గారికి కానుక చేసిన.................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?