'తెలంగాణ దేవదాసు' గురించి కొంత..
- డా. కాలువ మల్లయ్య
పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయం నుంచే నాకు పాఠ్యపుస్తకాలతో పాటు సాహిత్య గ్రంథాలు చదివే అలవాటు ఉండేది. మా నాన్న నిజాం పాలనా కాలంలో చదువుకున్న నాలుగైదు తరగతుల కనిగిరి బడి చదువు అక్షర జ్ఞానంతో అన్ని పుస్తకాలు అంటే డాక్టర్ నవలలు మొదలుకొని రామాయణ మహా భారతాది గ్రంథాల వరకు చదవేవాడు. ఇంట్లో పుస్తకాలు తెచ్చిపెట్టేవాడు. ఆ అలవాటుతో నాకూ సాహిత్య పఠనం అలవాటయింది. అందులో భాగంగా బెంగాలీ సాహిత్యం, ముఖ్యంగా శరత్ నవలలు, రవీంద్రనాథ్ ఠాకూర్, బంకించంద్ర ఛటర్జీ సాహిత్యం కూడా చదివాను. శేషప్రశ్న నవలను నాలుగైదుసార్లు చదివినా అర్థం కాలేదు. దేవదాసు నవలను ఇప్పటి వరకూ చదవలేదు కాని నాగేశ్వర్రావు నటించిన సినిమాను ఏడెనిమిది సార్లు చూసాను. అద్భుత కళాఖండంగా అది నా మనసులో చెరగని ముద్ర వేసింది. ఆ కథకు మూలాలు శరత్ నవల దేవదాసులో ఉన్నాయని తెలుసుకొని ఆ నవల ఎందుకు చదవలేకపోయానని అనుకున్నాను కాని ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయాను. సినిమా ముద్రను మాత్రం చెరిపేయలేకపోయాను.
రచయితగా నా ప్రస్థానం ప్రారంభమైన తర్వాత తెలంగాణ ప్రాంతీయ ముద్రతో తెలంగాణ జీవితాన్ని, సంఘర్షణను, ఉద్యమాలను, సంస్కృతిని ముఖ్యంగా బహుజన వర్గాలను తీసుకొని కధలు, నవలలు రాయడం ప్రారంభించాను కాని ప్రేమ.......................