Logili Books

Novels

Ontari Pooraatam

By N S Nagireddy

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ontari Pooraatam
Author
Publisher
Brilliant Books
ISBN
MANIMN4372
Binding
Papar back
Published Date
2023
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

ఒంటరి పోరాటం

"రూపా! మా మాట వినవే....! మీ నాన్నగారికి ఈ విషయము తెలిస్తే మమ్మల్ని బ్రతకనివ్వరు... అసలే గారాబు పట్టివా!”

"పిచ్చిగా మాట్లాడకే...! మా డాడీ సంగతి తెలిసీ ఇలా మాట్లాడతావేం? ఆయనేం అనరు... పైగా నేనూ నలుగురిలో ఒకటిగా కలిసిపోయినందుకు చాలా సంతోషిస్తారు.”

“అదికాదే... ఆయనకు ఒక్కగానొక్క ముద్దుల కూతురివి. అడుగు క్రిందపెడితే కందిపోతావన్నంత సుకుమారంగా, గారాబంగా నిన్ను పెంచుకున్నారు. ఇప్పుడు నువ్విలా... ఒక సాధారణ యువతిలా, ఓ ఆర్డినరీ స్లీపర్ కోచ్లో ప్రయాణం చేసి వచ్చావని తెలిస్తే ఎంతగా వర్రీ అవుతారో ఆలోచించు!”

“అవునే...! అందుకే తొందరపడి నీ ఫ్లయిట్ టికెట్ కాన్సిల్ చేసుకోవద్దని పోరాను... నా మాట వినలేదు!"

"ఇదెప్పుడూ ఇంతే... మన మాట ఎప్పుడు వినిపించుకుంది గనుక... దీని మొండితనం దీనిదే!”

రూపా అని పిలవబడే ఇరవై రెండేళ్ల రూపిణి తన చుట్టూ చేరి బ్రతిమలాడు కుంటున్న తన స్నేహిరాళ్ళను చూసింది.

అందరూ దాదాపుగా ఒకే ఈడువారు. వయసులో మాత్రమే కాదు, అందంలో, చదువులో గుణంలో ఒకరితో ఒకరు పోటీపడుతుంటారు.

అందరిలోనూ రూపిణి మరీ కొట్టొచ్చినట్లు కనబడే సౌందర్యవతి. లేత గులాబీ వర్ణంలో ముట్టుకుంటే మాసిపోయే అందాల బొమ్మలా వుంటుంది.

మిగిలిన ఆమె స్నేహితురాళ్ళు సత్య, కీర్తన, మాల, విమల కూడా యవ్వనమనే వసంతం వరించిన సన్నజాజి తీవెల్లా వున్నారు.................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?